English | Telugu
బిగ్ బాస్ 5 విన్నర్ సన్నీ! రూ. 50 లక్షలు గెలిచాడు!!
Updated : Dec 19, 2021
బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్ విజేతగా వీజే సన్నీ నిలిచాడు. ఎక్కువమంది విశ్లేషకులు ఊహించినట్లుగానే, సోషల్ మీడియా ట్రెండ్స్ ప్రకారంగానే వీజే సన్నీ తన నెవర్ గివప్ యాటిట్యూడ్‌తో అత్యధిక వీక్షకుల అభిమానాన్నీ, వారి ఓట్లనూ గెలుచుకొని బిగ్ బాస్ తెలుగు 5 ట్రోఫీని అందుకున్నాడు. వాటితో పాటు రూ. 50 లక్షల నగదు, షాద్‌నగర్‌లోని సువర్ణభూమి వెంచర్‌లో రూ. 25 లక్షల విలువ కలిగిన ఫ్లాట్‌ను, అపాచీ మోటార్ బైక్‌ను గెలుచుకున్నాడు. అతనికి చివరిదాకా గట్టిపోటీ ఇచ్చిన షణ్ముఖ్ జస్వంత్ రన్నర్‌గా నిలిచాడు. యూట్యూబర్‌గా ఉన్న క్రేజే అతడిని ఇక్కడిదాకా తీసుకువచ్చింది.
Also read:ఎలిమినేట్ అయిన సిరి.. హౌస్ బయటకు తెచ్చిన రష్మిక-దేవి!
మొదట ఆ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారనీ, వారిని హౌస్ నుంచి బయటకు తీసుకురావాల్సిందిగా జాతిరత్నాలు హీరోయిన్, బంగార్రాజులో పార్టీ సాంగ్‌లో డాన్స్ చేసిన ఫరియా అబ్దుల్లాను పంపారు హోస్ట్ నాగార్జున. ఆమె హౌస్‌లోకి వెళ్లి, ఇద్దరు ఫైనలిస్టులతో సరదాగా డాన్సులు వేసింది. సన్నీ, షణ్ణుల ముందు చెరో బాక్స్ పెట్టి, ఆ బాక్స్‌లో చేతులు ముంచి, పైకి తియ్యాలనీ, ఎవరికి రెడ్ కలర్ వస్తే వారికి ఫరియా చేతిలోని రెడ్ హార్ట్‌ను ఇచ్చి, హౌస్ బయటకు తీసుకురావాలనీ చెప్పారు నాగ్. ఫైనలిస్టులు అలాగే చేశారు. ఆశ్చర్యకరంగా ఇద్దరి చేతులకూ ఆ రెండు రంగుల్లో ఏ ఒక్కటీ కాకుండా, బ్లూ కలర్ అంటుకుంది. దాంతో ఫరియాను బయటకు వచ్చేయమన్నారు నాగ్.
Also read:నిన్నటి వరకు సిరి ఫ్రెండ్.. కానీ ఇప్పడు పెళ్లాం?
ఆ తర్వాత నాగ్ స్వయంగా హౌస్‌లోకి వెళ్లి, లివింగ్ రూమ్‌లో కలియతిరిగి, అక్కడ సోఫాలో కూర్చున్నారు. షణ్ణు, సన్నీలను చెరో పక్కన కూర్చోపెట్టుకొని కబుర్లు చెప్పారు. ఆ తర్వాత ఆ ఇద్దరినీ పట్టుకొని బయటకు తీసుకువచ్చారు. స్టేజ్ మీద అందరూ ఊపిరి బిగపట్టుకొని ఉత్కంఠతో ఎదురుచూస్తుండగా, సన్నీని విన్నర్‌గా, షణ్ణును రన్నర్‌గా ప్రకటించారు నాగ్. ఆ మరుక్షణం సన్నీ ఆనందం తట్టుకోలేక భావోద్వేగానికి గురై స్టేజిమీద మోకాళ్లమీద కూర్చున్నాడు. ఆ తర్వాత ఎగిరి గంతులేశాడు. కోటును తీసేసి ఎదురుగా కూర్చున్న తోటి కంటెస్టెంట్ల వైపు విసిరేశాడు. నాగ్‌ను ముద్దు పెట్టేసుకున్నాడు. షణ్ణు తనలోని ఎమోషన్స్‌ను బయటపెట్టకుండా గంభీరంగా కనిపించాడు. సన్నీ వాళ్లమ్మ కళావతిని స్టేజి మీదకు ఆహ్వానించారు. ఆమె రాగానే సన్నీ ఆమెను బుగ్గమీద ముద్దు పెట్టుకున్నాడు. ఆమె చేతికి ట్రోఫీ అందించాడు.