English | Telugu
నా దునియాల నేను హీరోనే: సన్నీ
Updated : Dec 16, 2021
బిగ్‌బాస్ కథ క్లైమాక్స్ కి చేరింది. ఈ ఆదివారం గ్రాండ్ ఫినాలే జరగబోతోంది. టాప్ 5లో నిలిచిన కంటెస్టెంట్ లలో విజేత ఎవరన్నది ఓ పక్క ఉత్కంఠ రేపుతున్నా విజేత ఎవరేది ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. గ్రాండ్ ఫినాలేకు మరో రెండు రోజులే వుండటంతో బిగ్ బాస్ పాత టాస్కులని కంటెస్టెంట్ లకి మరోసారి గురువారం గుర్తు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇది సన్నీ, సిరిల మధ్య గొడవకు దారి తీసింది. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. సన్నీ ఓడిపోయావ్ అని అనగానే ఆ మాట వినడం ఇష్టంలేని సిరి సన్నీపై చిందులు తొక్కింది. నువ్వేమైనా హీరో అనుకుంటున్నా? అంటూ నాతో జోకులొద్దు అని వార్నింగ్ ఇచ్చింది.
ఐదో టాస్క్ లో తాళ్లను ఎక్కువ సేపు కదపాల్సి వుంటుంది. ఇందులో సరి, సన్నీ, షన్ను ఆడగా సన్నీ గెలిచాడు. దీంతో ఓడిపోయావు కదా మళ్లీ ఆడదామా అంటూ సిరిని సన్నీ సరదాగా ఆటపట్టించాడు. కానీ దాన్ని సీరియస్ గా తీసుకున్న సిరినువ్వే ఓడిపోయావ్ .. షన్ను ఒక్కడే కరెక్ట్ గా ఆడాడని రివర్స్ కౌంటర్ ఇచ్చింది. నేను జోక్ గా అన్నానని సన్నీ అనగా ఓడిపోయావన్న మాట సరదా కాదని తేల్చేసింది. మజాక్ గా అన్నానని సన్నీ ఎంత చెప్పినా సర్తిచెప్పినా సిరి పట్టించుకోలేదు. తిందాం రా అని పిలిచినప్పటికీ రానంటూ మొండిగా ప్రవర్తించింది.
Also read:శ్రీహాన్ ని తిట్టి అడ్డంగా బుక్కైన షణ్ముఖ్
పక్కనోడు గెలిస్తే సహించలేడంటూ ఆవేశంతో రగిలిపోయింది. నాతో జోకులొద్దు అని సన్నీకి వార్నింగ్ ఇచ్చింది సిరి. అలా సిరి అరవడంతో సహనం కోల్పోయిన సన్నీ ఆమెని ఇమిటేట్ చేయగా సిరి మరింతగా రెచ్చిపోయింది. ప్రతిసారి వచ్చి ఇమిటేట్ చేయడమేంటి అని మండిపడింది. నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా?.. తోపు అని ఫీలవుతున్నావా? అంటూ సన్నీపై ఫైర్ అయింది. ఆ తరువాత సన్నీ.. మానస్ తో మాట్లాడుతూ ఎప్పుడు ఏ గొడవైనా కూడా నేనే వెళ్తాను. ఇంత ఓవరాక్టింగ్ బ్యాచ్ ఏంట్రా? .. వెళ్లేముందు నన్ను బ్యాడ్ చేస్తే ఏమొస్తుందిరా? నువ్వు పెద్ద హీరోవా? అంటు నన్ను ఇష్టపడేవాళ్లకు, నా దునియాల నేను హీరోనే `అని సన్నీ క్లారిటీ ఇవ్వడం ఆకట్టుకుంటోంది. ఈ గొడవకు ఎండ్ కార్డ్ పడిందా లేదా? అన్నది తెలియాలంటే శుక్రవారం రాత్రి ఎపిసోడ్ చూడాల్సిందే.