English | Telugu
సిరి, షన్ను రిలేషన్ పై సన్నీ కామెంట్
Updated : Dec 20, 2021
కప్పు ముఖ్యం బిగులూ.. అప్నా టైమ్ ఆయేగా.. అమ్మకు కప్పు బహుమతిగా ఇస్తానని మాటిచ్చా.. అంటూ వీక్షకుల మనసులు గెలుచుకున్న వీజే సన్నీ అలియాస్ అరుణ్ రెడ్డి అన్నట్టుగానే బిగ్‌బాస్ సీజన్ 5 విజేతగా నిలిచాడు. తన మాటలతో.. చేతలతో విజేత ఎలా వుండాలో చూపించి ఫైనల్ గా కప్పు కొట్టాడు. ప్రైజ్ మనీనీ కూడా భారీగానే దక్కించుకుని అందరి చేత ఔరా అనిపించుకున్న సన్నీ స్టేజ్ పై చెప్పిన మాటలు అందరిని కదిలించాయి.
ఇక హౌస్ లో సరి, సన్నీల మధ్య జరిగిన సన్నివేశాలని, వారి మధ్య వున్న అనుబంధంపై వస్తున్న ఊహాగాలకు క్లారిటీ ఇచ్చాడు. ఈ జర్నీలో తనని సిరి, షన్ను వాంటెడ్ గా ఇంబ్బందులకు గురిచేసినా.. అతన్ని విలన్ గా చిత్రీకరించాలని ప్రయత్నాలు చేసినా వాటన్నింటినీ నవ్వుతూనే భరించాడు.. మళ్లీ వాళ్ల స్నేహం కోసం తపించాడు. తనని ఎంత దూరం పెట్టాలని సరి - షన్ను ప్రయత్నిస్తే తాను వారికి అంత దగ్గరయ్యేందుకు తాపత్రయపడ్డాడు.. అక్కడే సన్నీ గెలిచాడు.
ఇక హౌస్ లో తనని ఎంతగా అన్ పాపులర్ చేయాలని ప్రయత్నించినా వారి స్నేహం కోసమే ముందుకు వెళ్లిన సన్నీ గ్రాండ్ పినాలే సాక్షిగా వాళ్ల కళ్లు తెరిపించే ప్రయత్నం చేయడం విశేషం. తనని ద్వేషించినా వారికి మంచే చేయాలన్న ఉద్దేశంతో సన్నీ.. సిరి - షన్నుల బంధంపై వస్తున్న కామెంట్స్‌కి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. షన్ను - సిరిల బంధం గురించి క్లారిటీ ఇవ్వాలి సార్ అని నాగ్ కు చెబుతూనే వారిది మానస్ కు తనకు ఉన్న బంధం లాంటిదని స్పష్టం చేశాడు. అంతే కాకుండా సిరి - షన్నుల పై జరుగుతున్న ప్రచారాన్ని ఆపే ప్రయత్నం చేయడం ఇక్కడ గమనార్హం. ఫైనల్ స్టేజ్ పై సన్నీ అన్న మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.