వేద..యష్ కి అండగా నిలుస్తుందా?
బుల్లితెర ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మలబంధం`. నిరంజన్, డెబ్జాని మోడక్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా బెంగళూరు పద్మ, ప్రణయ్ హనుమాండ్ల, ఆనంద్, శ్రీధర్ జీడిగుంట కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బేబీ మిన్ను, నైనిక చుట్టూ తిరిగే కథగా రూపొందుతున్న ఈ సీరియల్ గత కొన్ని వారాలుగా మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. మంగళవారం ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారబోతోంది.