English | Telugu
గ్రాండ్ ఫినాలే సాక్షిగా వక్రబుద్ది చూపించిన షణ్ముఖ్
Updated : Dec 20, 2021
బిగ్‌బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలేలో వీజే సన్నీ విజేతగా నిలిచాడు. ఆల్ ఎమోషన్స్‌ని పలికించిన పరిపూర్ణమైన వ్యక్తిగా ఆకట్టుకున్న సన్నీతన ప్రవర్తనతో కోట్లాది మంది హృదయాల్ని గెలుచుకుని విజేత అయ్యాడు. బిగ్‌బాస్ టైటిల్ తో పాటు భారీ స్థాయిలోనే ప్రైజ్ మనీని దక్కించుకుని బిగ్‌బాస్ సీజన్ విజేతల్లో హాట్ టాపిక్ గా మారాడు. అయితే ఈ పరిణామం ముందు నుంచి టైటిల్ విజేతను తానే అనుకుంటూ వస్తున్న యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ బిగ్‌బాస్ స్టేజ్ పై తన వక్ర బుద్దిని బయటపెట్టాడు.
సన్నీ విజేతగా నిలిచి షాకివ్వడంతో మైండ్ బ్లాక్ అయిన షన్ను స్టేజ్ పై తన వక్క బుద్దిని మరోసారి బయటపెట్టాడు. దీంతో అతనిపై నెట్టింట ట్రోలింగ్ మొదలైంది. షన్ను రన్నర్‌గా నిలవడానికి అతని ప్రవర్తనతో పాటు సిరితో వ్యవహరించిన తీరే ప్రధాన కారణం. యూట్యూబ్‌లొ భారీ ఫ్యాన్ బేస్‌ని సొంతం చేసుకున్న షణ్ముక్ అసలు బండారం బిగ్‌బాస్ హౌస్ లోకి వచ్చాకే బయటకి తెలిసింది. సిరితో బాత్రూమ్ వద్ద చేసిన పనులకు, మోజ్ రూమ్ సాక్షిగా సిరిని టార్చర్ పెట్టిన తీరుకే షన్నుని ప్రేక్షకులు రన్నర్ గా నిలబెట్టారు.
అయితే ఇంత జరిగినా.. తనని విజయం అపహాస్యవం చేసినా సన్నీని విజేతగా నిలిపినా తన తప్పేంటో తెలుసుకోలేక గ్రాండ్ ఫినాలే స్టేజ్ సాక్షిగా మరోసారి షన్ను తన వక్ర బుద్దిని బయటపెట్టాడు. సన్నీని విజేతగా ప్రకటించిన తరువాత రన్నర్ స్పీచ్ కావాలని నాగార్జున అడిగితే షణ్నూ మాట్లాడిన తీరు అతని వక్ర బుద్దిని బయటపెట్టింది. `పర్లేదు.. పర్లేదు.. విన్నింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్.. ఆట ఎలా ఆడాం అన్నదే ముఖ్యం` అంటూ తనలో దాగి వున్న విషాన్ని వెల్లగక్కాడు. దీంతో నెట్టింట షన్నూని ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు నెటిజన్స్. విన్నింగ్ ముఖ్యం కాదు అన్నప్పుడు ఇన్ని రోజులు హౌస్ లో ఎందుకున్నావని రన్నర్ గా మిగిలినా ఇంకా బుద్ది రాలేదని తిట్టిపోస్తున్నారు.