English | Telugu
రవితేజను ఆడుకున్న బాలయ్య!
Updated : Dec 20, 2021
'అఖండ' మూవీతో కెరీర్ బిగ్గెస్ట్ గ్రాసర్‌ను అందుకున్న నటసింహ నందమూరి బాలకృష్ణ ఓటీటీ వేదికపై కూడా చెలరేగిపోతున్నారు. తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా'లో ఆయన ఫస్ట్ టైమ్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ షో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' ఇన్‌స్టంట్ హిట్టయింది. ఇప్పటికి స్ట్రీమింగ్ అయిన ఐదు ఎపిసోడ్లను ఆడియెన్స్ బాగా ఆదరించినట్లు, ఆస్వాదించినట్లు రిపోర్టులు వచ్చాయి.
మొదటి ఎపిసోడ్‌లో మోహన్‌బాబు ఫ్యామిలీ, రెండో ఎపిసోడ్‌లో నాని, మూడో ఎపిసోడ్‌లో బ్రహ్మానందం, అనిల్ రావిపూడి, నాలుగో ఎపిసోడ్‌లో బోయపాటి శ్రీను, ఐదో ఎపిసోడ్‌లో రాజమౌళి, కీరవాణి వచ్చారు. వారితో బాలయ్య జరిపిన సరదా సంభాషణ వీక్షకులకు బాగా నచ్చేసింది. అసలు బాలయ్యలో ఈ తరహా కోణం ఒకటి ఉందనే విషయం ఇప్పటిదాకా తెలియలేదనీ, హోస్ట్‌గా బాలయ్య చాలా బాగా ఆకట్టుకుంటున్నారనీ వీక్షకులు అంటున్నారు.
Also read:బిగ్‌బాస్ 'వీజే'త సన్నీకి దక్కింది ఎంత?
కాగా ఆరో ఎపిసోడ్‌లో 'క్రాక్' జోడీ రవితేజ, గోపీచంద్ మలినేని గెస్టులుగా కనిపించనున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను ఆహా తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా షేర్ చేసింది. ఈ ఫొటోల ప్రకారం బాలయ్య తన గెస్టులతో గేమ్‌లు కూడా ఆడినట్లు అర్థమవుతోంది. ఒక తాడును గోపీచంద్ నడుముకు చుట్టి, అతడిని మధ్యలో నిలబెట్టి, తాడు ఒక కొసను తను పట్టుకొని, రెండో కొసను రవితేజ చేతికి అందించారు బాలయ్య. గోపీచంద్‌ను ఆయన ఎలా ఆడుకుంటాడనేది ఈ నెల 24న స్ట్రీమింగ్ కానున్న ఎపిసోడ్‌లో మనకు తెలుస్తుంది. అన్నట్లు గోపీచంద్ డైరెక్షన్‌లోనే తన నెక్ట్స్ మూవీని చేయనున్నాడు బాలయ్య.
Also read:'ఎవరు మీలో కోటీశ్వరులు'.. మహేష్ ఎపిసోడ్ కి ఇంత దారుణమైన రేటింగా!!
ఇదిలా ఉంటే.. బాలయ్య షోకు రవితేజ రావడం కూడా చాలామందిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎందుకంటే గతంలో ఆ ఇద్దరి మధ్యా ఏవో గొడవలు ఉన్నట్లు ఇండస్ట్రీలో ప్రచారమైంది. తన సరసన హీరోయిన్‌గా చేసిన ఒక నటి, ఆ తర్వాత బాలకృష్ణ సినిమాలో హీరోయిన్‌గా నటించేందుకు అంగీకరించినప్పుడు, వద్దని రవితేజ వారించాడనీ, ఇది తెలిసి రవితేజకు బాలయ్య గట్టి వార్నింగ్ ఇచ్చాడనీ వదంతులు వచ్చాయి. అందులో ఎంత నిజముందో తెలీదు. ఇప్పుడు బాలయ్య షోకు రవితేజ రావడంతో ఆ ఇద్దరు ఏం మాట్లాడుకుంటారో చూడ్డానికి చాలామంది ఎదురుచూస్తున్నారు.