English | Telugu

'ఎవరు మీలో కోటీశ్వరులు'.. మహేష్ ఎపిసోడ్ కి ఇంత దారుణమైన రేటింగా!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల బుల్లితెరపై 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోతో అలరించిన సంగతి తెలిసిందే. ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ కి గెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాగా ఆ ఎపిసోడ్ కి 11.4 టీఆర్పీ వచ్చింది. ఆ తర్వాత ఈ షోకి ఆ స్థాయిలో రేటింగ్ రాకపోయినా.. సెలబ్రిటీలు గెస్ట్ లుగా వచ్చినప్పుడు ఓ మాదిరి రేటింగ్ వచ్చింది. ఇక ముగింపు ఎపిసోడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు సందడి చేయడంతో ఈ ఎపిసోడ్ కి.. ఫస్ట్ ఎపిసోడ్ కి వచ్చిన రేంజ్ రేటింగ్ వస్తుందని భావించారంతా. కానీ అనూహ్యంగా అందులో సగం కూడా రాకపోవడం గమనార్హం.

ఈఎంకేలో మహేష్ సందడి చేసిన ఎపిసోడ్ కి కేవలం 4.9 టీఆర్పీ మాత్రమే నమోదైంది. ఇద్దరు స్టార్స్ ఉన్నప్పటికీ ఈ ఎపిసోడ్ కి ఇంత దారుణమైన రేటింగ్ రావడానికి అనేక కారణాలున్నాయి. మహేష్ ఈఎంకే షో షూట్ లో పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో ముందే లీక్ అయ్యాయి. దీంతో ఆ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడా వస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ నిర్వాహకులు మాత్రం దసరా, దీపావళి ఇలా ఎన్నో అకేషన్స్ వచ్చినా మహేష్ ఎపిసోడ్ ని టెలికాస్ట్ చేయకుండా చివరి ఎపిసోడ్ కోసం హోల్డ్ చేసి ఉంచారు. దీంతో ఈ ఎపిసోడ్ పై రోజురోజుకి ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోయింది. దానికితోడు ఈ షో మిగతా ఎపిసోడ్స్ ప్రతివారం సోమవారం నుంచి గురువారం వరకు ప్రసారమైతే.. మహేష్ ఎపిసోడ్ మాత్రం ఆదివారం టెలికాస్ట్ అయింది. అది కూడా ఎపిసోడ్ రేటింగ్ పై ప్రభావం చూపిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరోవైపు 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో ఓవరాల్ గా కూడా ఆశించినస్థాయిలో రేటింగ్స్ ని రాబట్టలేదని తెలుస్తోంది. గతంలో బిగ్ బాస్ షోతో తారక్ ఆకట్టుకున్నాడు. ఆ షోకి రికార్డ్ రేటింగ్స్ వచ్చాయి. అయితే ఈఎంకే షో ఓల్డ్ ఫార్మాట్ కావడంతో అంచనాలకు తగ్గ రేటింగ్స్ ని సాధించలేక పోయిందని అంటున్నారు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.