English | Telugu
ఎలిమినేట్ అయిన సిరి.. హౌస్ బయటకు తెచ్చిన రష్మిక-దేవి!
Updated : Dec 19, 2021
బిగ్ బాస్ 5వ సీజన్ తుది అంకానికి వచ్చింది. ఇవాళ ఐదుగురు ఫైనలిస్టుల్లో విజేత ఎవరో తేలనున్నారు. అందరికంటే ముందుగా ఫైనలిస్టుల్లో ఉన్న ఒకే ఒక అమ్మాయి సిరి హన్మంత్ ఎలిమినేట్ అయ్యింది. ఆమెను హౌస్ నుంచి బయటకు తెచ్చిందెవరో తెలుసా? యువతరం కలలరాణి రష్మికా మందన్న, రాక్‌స్టార్ దేవి శ్రీప్రసాద్. ఆడియెన్స్ పోల్ ప్రకారం ఫైనలిస్టుల్లో ముందుగా ఎలిమినేట్ అయిన ఒకరిని హౌస్ నుంచి బయటకు తెచ్చే బాధ్యతను రష్మిక, దేవికి అప్పగించారు హోస్ట్ నాగార్జున.
Also read:నిన్నటి వరకు సిరి ఫ్రెండ్.. కానీ ఇప్పడు పెళ్లాం?
హౌస్‌లోకి రష్మిక, దేవి వెళ్లగాను 'పుష్ప' మూవీలోని "సామి సామి" పాటను ప్లే చేశారు. దానికి రష్మికతో పాటు సిరి, మిగతా కంటెస్టెంట్లు డాన్స్ చేశారు. ఐదుగురు కంటెస్టెంట్లను ఒకచోట నిలబెట్టారు. పైనుంచి ఐదు డ్రోన్లు ఎగురుకుంటూ హౌస్‌లోకి వచ్చాయి. ఒక్కో డ్రోన్‌కు ఒక్కో కంటెస్టెంట్ ఫొటో ఉంది. నాలుగు డ్రోన్లు అక్కడే ఉండగా, సిరి ఫొటో ఉన్న డ్రోన్ హౌస్ బయటకు వెళ్లిపోయింది. దాంతో ఆమె ఎలిమినేట్ అయినట్లు నాగ్ ప్రకటించారు.
Also read:శ్రీహాన్ ని తిట్టి అడ్డంగా బుక్కైన షణ్ముఖ్
అయితే దీన్ని ముందుగానే ఊహించినట్లు సిరి ఎక్కువ ఎమోషన్ కాలేదు. స్పోర్టివ్‌గా తీసుకొని, తోటి కంటెస్టెంట్లకు వీడ్కోలు పలికి, రష్మిక-దేవితో పాటు బయటకు వచ్చింది. తన చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో అమ్మే కష్టపడి పెంచిందనీ, అయితే ఆమె బిజినెస్ చేసుకుంటూ ఉండటంవల్లా ఆమెతోనూ తాను సన్నిహితంగా గడపలేదనీ చెప్పింది సిరి. అందువల్లే ఎవరైనా తనతో ప్రేమగా మాట్లాడితే, వారికి సన్నిహితమైపోతానని తెలిపింది. ఫైనలిస్టుల్లో ఒకరిని అవుతానని ముందుగా తాను ఊహించలేదనీ, ఇక్కడిదాకా రావడమే తనకు పెద్ద అచీవ్‌మెంట్ అనీ చెప్పింది సిరి.