English | Telugu
గోవాలో మోనిత చెరుకు రసం
Updated : Mar 29, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న టాప్ సీరియల్ `కార్తీక దీపం`. గత కొంత కాలంగా విజయవంతంగా ప్రసారం అవుతూ దేశ వ్యాప్తంగా టాప్ రేటింగ్ ని సొంతం చేసుకుంది. మలయాళ సీరియల్ కు రీమేక్ గా రూపొందిన ఈ సీరియల్ ద్వారా మలయాళ నటి ప్రేమి విశ్వనాథ్ తెలుగులో వంటలక్కగా పాపులారిటీని సొంతం చేసుకోవడమే కాకుండా స్టార్స్ తరహాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది. వంటలక్కకు జోడీగా నటించిన పరిటాల నిరుపమ్ కూడా స్టార్ సెలబ్రిటీగా మారిపోయాడు. ఇదిలా వుంటే ఈ సీరియల్ లో వంటలక్క, డాక్టర్ బాబు నిరుపమ్ ల పాత్రలకు శుభం కార్డు వేసేశాడు దర్శకుడు.
వీరితో పాటు మోనిత పాత్రకు కూడా అల్ మోస్ట్ ఎండింగ్ ఇచ్చేశాడు. దీంతో `కార్తీక దీపం` సీరయల్ కు ప్రధాన ఆయువు పట్టుగా నిలిచిన ఈ ముగ్గురు ప్రస్తుతం రిలాక్స్ మోడ్ లోకి వెళ్లిపోయారు. మోనిత, డాక్టర్ బాబు ఇటీవల స్టార్ మా లో జరిగిన ఓ ఈవెంట్ లో తళుక్కున మెరిసారు. బుల్లితెరపై రొమాన్స్ చేసే ఛాన్స్ రాకపోవడంతో తాజా ఈవెంట్ లో ఆ ముచ్చట తీర్చుకున్నారు. రొమాంటిక్ పాటలకు డ్యాన్స్ చేసి రొమాంటిక్ జోడీ అనిపించుకున్నారు.
ఇక వంటలక్క మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. టీవీ షోల్లోనూ కనిపించడం లేదు. కానీ మోనిత మాత్రం ప్రతీ చోటా నేనే అంటూ హడావిడి చేస్తోంది. ప్రదీప్ సూపర్ క్వీన్ తో పాటు పలు టీవీ షోల్లో సందడి చేస్తున్న మోనిత తాజాగా గోవాలో హల్ చల్ చేసింది. వెకేషన్ కి వెళ్లిన మోనిత (శోభా శెట్టి) గోవా వీధుల్లో తిరుగుతూ అక్కడి అందాలని ఆస్వాదిస్తూ సందడి చేస్తోంది. ఓ చెరుకురసం బండి దగ్గర మోనిత చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇందుకు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.