English | Telugu
బిందు మాధవి ఎంత మాట అనేసింది
Updated : Mar 27, 2022
బిగ్ బాస్ నాన్‌స్టాప్ ఓటీటీ వెర్షన్ చిత్ర విచిత్రమైన టర్న్‌లు తీసుకుంటోంది. ఈ షోలో తెలుగు నుంచి తమిళ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ హీరోయిన్ గా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న బిందు మాధవి హాట్ టాపిక్‌గటా మారుతోంది. ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ లేకుండానే తనదైన స్టైల్ గేమ్ ప్లాన్ తో తమిళ బిగ్బాస్ లో టాప్ 4లో నిలిచిన బిందు మాధవి తాజాగా తెలుగు బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ లోనూ హల్ చల్ చేస్తోంది. బిందు మాధవి వ్యవహరిస్తున్న తీరు, మాట్లాడుతున్న విధానం కంటెస్టెంట్ ల మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తోంది.
సీజన్ 4 లో రన్నరప్ గా నిలిచిన అఖిల్ ఈ షోలకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సారైనా టైటిల్ సాధించాలని అషురెడ్డి, అజయ్, స్రవంతి, నటరాజ్ మాస్టర్ లతో ప్రత్యేకంగా గ్రూప్ కట్టి సేఫ్ గేమ్ ప్లాన్ చేసి మరీ ఆడుతున్నాడు. ఈ విషయంలోనే బిందు మాధవికి - అఖిల్ కి మధ్య గత కొన్ని రోజులుగా వారు నడుస్తోంది. తాజాగా అది పతాక స్థాయికి చేరింది. సేఫ్ గేమ్, ఫ్రెండ్స్ ని అడ్డంపెట్టుకుని ఆడుతున్నావని బిందు మాధవి కామెంట్ చేయడంతో హౌస్ లో ఇది పెద్ద రచ్చకు దారితీసింది. అఖిల్ అన్న మాటని బిందు మాధవి యాజిటీజ్‌గా అనడంతో ఆడ మాడా అంటూ ఇద్దరి మధ్య గొడవ మొదలైంది.
అఖిల్ మాటలని రిపీట్ చేస్తూ బిందు మాధవి `నువ్వేదీ ఆడా.. నువ్ అసలు ఏదీ ఆడా అని పెద్దగా అరిచేసింది. దీంతో అఖిల్ కి కోపం వచ్చేసింది. ఏమన్నావ్ అంటూ అరిచేశాడు. ఫ్రెండ్స్ దగ్గరి నుంచి అన్నీ తీసుకోవడం గేమ్ కాదు.. సొంతంగా ఆడాలి అన్నాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన బిందు మాధవి `ఫ్రెండ్స్ సపోర్ట్ తో బతుకుతున్నది నువ్వు.. నేను కాదు` అనేసింది. ఆ తరువాత ఇద్దరి మధ్య చాలా రచ్చ జరిగింది. ఆ తరువాత `నువ్ ఆడ.. నువ్ ఆడ అన్నావ్.. అని అఖిల్ చెప్పడంతో నువ్వే కదా.. నేను ఆడా అని అన్నావ్.. నీ స్లాంగ్ లోనే నేను రిపీట్ చేశా అని చెప్పింది. నేను అన్నదే నువ్ రిపీట్ చేశావా? అదే వర్డ్ యూజ్ చేశావా? అని అఖిల్ అడగ్గా... అదే యూజ్ చేశా అని చెప్పింది బిందు మాధవి.. దీంతో మాట మార్చేసిందని అఖిల్ ఏడ్వడం మొదలుపెట్టాడు.