English | Telugu
శ్రీముఖిపై అన్నపూర్ణమ్మ ట్రిపుల్ ఆర్ పంచ్
Updated : Mar 31, 2022
స్టార్ మా లో ఓంకార్ ప్రొడ్యూస్ చేసిన కామెడీ షో `కామెడీ స్టార్స్`. ఈ షోలో గత కొన్ని నెలలుగా యాంకర్ గా మెరిసిన శ్రీముఖి తాజాగా నాగబాబు ఎంట్రీతో అక్కడి నుంచి బయటికి వచ్చేసింది. నాగబాబు ఎంట్రీ తరువాత ఈ షోని `కామెడీ స్టార్స్ ధమాకా`గా మార్చేశారు. శ్రీముఖి ప్లేస్ లో ఈ షోకి దీపికి పిల్లి యాంకర్‌గా వ్యవహరిస్తోంది. దీంతో ఈ షో నుంచి బయటికి వచ్చేసిన శ్రీముఖి ఈటీవీ కోసం మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్స్ సరికొత్తగా ప్రారంభిస్తున్న `జాతిరత్నాలు` స్టాండప్ కామెడీ షోకు యాంకర్‌గా వ్యవహరిస్తోంది.
శ్రీముఖితో పాటు ఈ షోలో నటి ఇంద్రజ కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ 4 నుంచి ప్రారంభం కానున్న ఈ షోలో అన్నపూర్ణమ్మ, పోసాని కృష్ణ మురళి, కృష్ణ భగవాన్, భద్రం స్టాండప్ కామెడీ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన తాజా ప్రోమోని ఇటీవల విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ప్రమోలో పోసాని, కృష్ణ భగవాన్, భద్రం వేసిన పంచ్ లు అదిరిపోయాయి. అయితే అన్నపూర్ణమ్మ ఏకంగా శ్రీముఖిని టార్గెట్ చేసి వేసిన పంచ్ లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
శ్రీముఖి గురించి కొంచెం చెబుతానే అంటూ మొదలుపెట్టింది అన్నపూర్ణమ్మ.. టీవీల్లో అందరూ రాములమ్మా రాముల్మమా అంటారుగా అదే తెలుసు తనకి టీవీ ముందు కూర్చున్న వాళ్లు మాత్రం రావద్దమ్మా.. రావద్దమ్మా అంటుంటారు. అంటే పంచ్ వేసేసింది. ఆ తరువాత శ్రీముఖిని స్టేజ్ మీదకి పిలిచిన అన్నపూర్ణమ్మ నిన్ను ట్రిపుల్ ఆర్ సినిమాలో అడిగారా అంది.. దీనికి శ్రీముఖి అడగలేదే అని చెప్పింది.. వెంటనే `అదేంటీ.. నువ్వు మాట్లాడితే ఆర్ ఆర్ వేసినట్టువుంటది కదా ట్రిపుల్ ఆర్ వాళ్లు నిన్ను పిలవాలి కదా? అంటూ మరో పంచ్ వేసింది. దీంతో శ్రీముఖి ముఖం మాడిపోయింది. ఈ పంచ్ లకి ఇంద్రజ పడి పడి నవ్వడంతో అక్కడున్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు.