Brahmamudi : కోడళ్ళిద్దరి ప్రెగ్నెంట్ పోవాలని రుద్రాణి ప్లాన్.. కావ్య కనిపెడుతుందా!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -821 లో.....రేవతిని సీతారామయ్య దగ్గరికి తీసుకొని వెళ్తారు. రేవతి ఇంటికి వచ్చిందని ఎక్కడ అపర్ణకి తెలిసిపోతుందోనని ఇందిరాదేవి టెన్షన్ పడుతుంది. అప్పు, కళ్యాణ్ స్వప్న అందరు రాజ్, కావ్య చేస్తున్న ప్లాన్ కి సపోర్ట్ గా ఉంటారు. అందరు సరదాగా మాట్లాడుకుంటుంటే.. అప్పుడే అపర్ణ వస్తుంది. వెంటనే రేవతికి ముసుగు కప్పుతారు. ఇందిరాదేవి టెన్షన్ పడుతుంటే.. ఏంటి అత్తయ్య టెన్షన్ పడుతున్నారని అపర్ణ అడుగుతుంది.