అమ్మ బిగ్ బాస్ లోకి తీసుకెళ్ళళపోయాను..ఏలిమినేట్ ఐన శ్వేత
బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఇప్పుడు చివరి దశకు వచ్చేసింది. ఇక 13 వ ఎపిసోడ్ లో శ్వేతా, ప్రసన్న కుమార్ ఏలిమినేట్ ఇపోయారు. అంటే 15 మందిలో ఇప్పుడు కేవలం 13 మంది మాత్రమే మిగిలారు. మూటలను హోల్స్ లో వేసే టాస్క్ లో హరీష్, శ్వేతా జోడి ఆడారు. కానీ ఆ టీమ్ ఓడిపోయింది. దాంతో బిందు రెడ్ కార్డు ఇచ్చింది. ఆల్రెడీ శ్వేతా దగ్గర ఒక ఎల్లో కార్డు ఉంది. ఇప్పుడు ఓడిపోవడంతో ఇక ఏలిమినేట్ చేసేసారు. "బిగ్ బాస్ కామన్ మ్యాన్ కి అవకాశం ఇస్తోంది అంటే నేను అన్నిటినీ దాటుకుని ఇక్కడి వరకు వచ్చాను. కానీ నేను చాలా ట్రై చేశాను. నేను బిగ్ బాస్ హౌస్ లోకి మా అమ్మను తీసుకెళ్లాలి అనుకున్నాను. కానీ కుదర్లేదు" అని చెప్పింది శ్వేతా.