ఇంటరెస్ట్ ఉంటే ప్రాజెక్ట్ కే షోలో ఉండండి..లేదంటే వెళ్లిపోవచ్చు
చెఫ్ మంత్రం ప్రాజెక్ట్ కే ఎట్టకేలకు స్టార్ట్ అయ్యింది. ఇక ఈ షోకి 5 జోడీలు వచ్చాయి. ఇక అంబటి అర్జున్ - అమర్ దీప్ , యాదమ్మ రాజు - సుప్రీతా, దీపికా - సమీరా భరద్వాజ్, ప్రష్షు- ధరణి, విష్ణు ప్రియా - పృద్వి వచ్చారు. ఇక హోస్ట్ గా సుమ, చెఫ్ గా జీవన్ వచ్చారు. ఇక జీవన్ ఐతే ఫుల్ వీళ్లందరినీ భయపెట్టేసాడు. "జోక్స్ చాలా ఎంజాయ్ చేస్తాను..కానీ కుకింగ్ దగ్గరకు వచ్చేసరికి నేను చాలా సీరియస్ గా ఉంటాను. నేను ఎప్పుడు ఎవరిని ఏమంటానో తెలీదు..మీరు ఫీలవుతారా, బాధపడతారా నేను అస్సలు పట్టించుకోను.