Jayam serial : వీరు కోసం వచ్చిన పోలీసులు.. గంగకి సపోర్ట్ గా పెద్దసారు!
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -54 లో.....పైడిరాజు నెక్లెస్ దొంగతనం చేసి గంగ తీసిందని తనపై నెట్టుతాడు. దాంతో రుద్ర ఒక ప్లాన్ చేస్తాడు. ఈ కిరోసిన్ గంగ, పైడిరాజు పోసుకోండి.. ఎవరైతే తప్పు చెయ్యలేదో వారికేం కాదని రుద్ర అనగానే గంగ పోసుకుంటుంది. పైడిరాజుకి బలవంతంగా పోస్తారు. ఇక చేసేదేమీ లేక తనే తీసానని పైడిరాజు ఒప్పుకుంటాడు. దాంతో ఇంట్లో అందరు తనపై కోప్పడతారు.