English | Telugu
లెక్చరర్‌ని కొట్టిన ఢీ షో సుదర్శన్ మాష్టర్..వాళ్లంతా ఇప్పుడు మాష్టర్లు అయ్యారు!
Updated : Sep 10, 2025
ఢీ షోలో సుదర్శన్ మాష్టర్ అంటే ఒక క్రేజ్ ఉంది. అతను చేసే కోరియోగ్రఫీ కొత్తగా ఉంటుంది. జడ్జెస్ కూడా ఫిదా ఐపొతూ ఉంటారు. ఇక సుదర్శన్ మాష్టర్ ఒక ఇంటర్వ్యూలో క్యూట్ గ కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. "కాలేజీలోనే తన లైఫ్ చేంజ్ అయ్యిందని చెప్పుకొచ్చాడు. స్కూల్ లో బ్యాక్ బెంచర్ ని. ఎందుకంటే అమ్మాయిలంతా ముందు కూర్చునే వాళ్ళు." అని చెప్పాడు. "ఐతే అమ్మాయిలను వెనక నుంచి చూడడం ఇష్టమా" అని హోస్ట్ అడిగేసరికి "చూసాం దేవుడు కళ్ళు ఇచ్చింది ఎందుకు అందాన్ని చూడడానికే కదా. నేను బిటెక్ చేసాను. ఇంజనీరింగ్ ఇష్టం లేదు నాకు. డాక్టర్ అవ్వాలనుకున్నా. నేను పుట్టి పెరిగింది అంతా బెంగుళూరు. కాలేజ్ ఫస్ట్ డేనే బంక్ కొట్టాను. మా స్కూల్ ఫ్రెండ్స్ అందరికీ ఒకే కాలేజ్ లో సీట్ లు వచ్చాయి. నేను అమ్మాయిలను అసలు పట్టించుకునే వాడినే కాదు.
ఒక తుంటరి పని చేసాను. ఒక గ్రూప్ అంతా కలిసి లెక్చరర్ ని కొట్టారు నేను కూడా ఒక చెయ్యేసాను. మా సతీష్ సర్ కి నేను ఫెవరేట్ పర్సన్ ని. స్కూల్ ఏజ్ నుంచే నేను డిఫెరెంట్ గా డాన్స్ చేసేవాడిని. ఐతే నేను స్టార్టింగ్ డేస్ లో ఎదుగుతున్నప్పుడు నన్ను చాలా మంది డి-గ్రేడ్ చేశారు. పేర్లు వద్దు కానీ అది వాళ్లకు తెలుసు. జీవితంలో ఒక టైం వస్తుంది అప్పటి వరకు హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలి. ఆ టైం వస్తే ఇక మీరు ఆగరు. ఇక మీరు స్టార్ ఐపోతారు." అని చెప్పుకొచ్చాడు. ఐతే షోలో ఉండే కండక్టర్ ఝాన్సీ ఇంటెలిజెంట్ అని ఆది కూల్ అని నందు బ్రదర్ అని ఇలా ఒక్కొక్కరి గురించి ఒక్క వర్డ్ లో చెప్పాడు.
ఇక చైతన్య మాష్టర్ గురించి చెప్పుకొచ్చాడు. "నాకు చైతన్య మాష్టర్ చాలా క్లోజ్ అయ్యాడు. అందరితో బాగా క్లోజ్ గా ఉండేవాడు. ఆ టైములో నాకు షోస్ లేనప్పుడు మనోడు నాకు బయట ఈవెంట్స్ ఇప్పిచ్చేవాడు. ఆ డబ్బులు నా అవసరాలు తీరుస్తాయి అనుకుంటే వాటికి నన్ను పంపించేవాడు. చాలా బెస్ట్ ఫ్రెండ్ గా ఉండేవాడు. ఏమయ్యిందో తెలీదు..ఎందుకు సూసైడ్ చేసుకున్నాడో తెలీదు. సూసైడ్ చేసుకునే రెండు రోజులు ముందు కూడా అందరం కలిసే ఉన్నాం. మరి ఏమయ్యిందో ఎందుకు ఈ ఆలోచన వచ్చిందో తెలీదు.
అప్పులు తీసుకున్నాడు అది ఇది అని అందరూ అన్నారు అప్పట్లో కానీ మనోడు మంచి ఫ్యామిలీతో, మంచి పొజిషన్ లో ఉన్నాడు. అప్పులు అలాంటివి ఏమీ లేవు. ఏ విషయంలో డిప్రెషన్ లోకి వెళ్ళాడో ఎవరికీ తెలీదు. ఆ డిప్రెషన్ లోకి వెళ్ళాక ఒక నాలుగు రోజులు చాలా సిక్ అయ్యాడు. ఎందుకు సూసైడ్ చేసుకున్నాడో వాడికే తెలుసు. ఏదైనా ఐ మిస్ యు చైతన్య అంతే నేను చెప్పేది. చైతన్యకు నాతోనే కాదు చాలామందితో మంచి బాండింగ్ ఉంది. అతని దగ్గర నుంచి వచ్చిన రాజు లాంటి చాలామంది ఉన్నారు. ఒక టీమ్ ని బిల్డ్ చేసాడు. ఆ టీమ్ నుంచి వచ్చిన వాళ్లంతా ఈరోజున మాస్టర్స్ గా ఉన్నారు. చైతన్య చాలామందికి మంచి లైఫ్ ఇచ్చాడు." అని చెప్పాడు సుదర్శన్ మాష్టర్.