Brahmamudi : కావ్యని కంటికి రెప్పలా చూసుకుంటున్న రాజ్. ప్రకాష్ కామెడీ అదుర్స్!
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -815 లో..... కావ్య, అప్పు ఇద్దరు ప్రెగ్నెంట్ కాబట్టి పైకి మెట్లు ఎక్కి వెళ్ళలేరని రాజ్, కళ్యాణ్ ప్లాన్ చేస్తారు. వాళ్ళ పేరెంట్స్ ని పైన గదికి పంపించి మనం కిందకి షిఫ్ట్ అవుదామని అన్నతమ్ముళ్లు అనుకుంటారు. ఆ విషయం అందరిని పిలిచి రాజ్, కళ్యాణ్ చెప్తారు. మేమ్ వెళ్ళమని అపర్ణ మొదట చెప్పినా.. ఇక తప్పేలా లేదని సరే అంటుంది.