English | Telugu
Bigg boss 9 Telugu : రీతూ చౌదరి తలకి గాయం.. తప్పంతా తనూజదేనా!
Updated : Sep 10, 2025
బిగ్ బాస్ సీజన్-9 మొదలై అప్పుడే రెండు రోజులు గడిచిపోయింది. హౌస్ లో నామినేషన్లు మొదలయ్యాయి. మొదటి దశలో ఓనర్స్ అందరు కలిసి రెంటర్స్ లోని సంజనని నామినేట్ చేశారు. ఇక బిగ్ బాస్ ఆదేశానుసరం ఈ సీజన్ లో మొదటి నామినేషన్ ప్రక్రియ మొదలయింది. నామినేషన్ ప్రక్రియ లో రెంటర్స్ వాళ్లలో వల్లే నామినేట్ చేసుకోవాలి.. ఓనర్స్ ది కేవలం పర్యవేక్షణ మాత్రమే.
టాస్క్ లో భాగంగా రూఫ్ లో నుండి ఎవరు ముందుగా వెళ్లి సుత్తి తీసుకుంటారో.. వాళ్ళకి నామినేట్ చేసే ఛాన్స్ వస్తుంది. ఆ సుత్తిని తర్వాత ఓనర్స్ లోని ఎవరో ఒకరికి ఇవ్వాలి. మొదటగా రీతు, తనూజ వెళ్లారు. రీతూకి రూఫ్ లో వెళ్తుండగా తనూజ అడ్డు వచ్చి తలకి గాయమవుతుంది. వెంటనే మెడికల్ రూమ్ కి తీసుకొని వెళ్తారు తలకి కట్టుకడతారు. నేను కావాలని చెయ్యలేదని రీతూకి తనూజ సారీ చెప్తుంది. తనూజ సుత్తి పట్టుకుంది కాబట్టి తను సంజన ని నామినేట్ చేస్తుంది. ఆ తర్వాత తన చేతిలోని సుత్తిని ఓనర్స్ లో పవన్ కళ్యాణ్ కి ఇస్తుంది తనూజ.
ఆ తర్వాత రాము, శ్రష్టి వెళ్తారు. సుత్తి రాము తీసుకుంటాడు. సుమన్ శెట్టిని నామినేట్ చేస్తూ సుత్తిని హరీష్ కి ఇస్తాడు. తనని నామినేట్ చేసినా కూడా సుమన్ శెట్టి సైలెంట్ గా ఉంటాడు. ఈ రోజు జరిగిన ఎపిసోడ్ లో ఇద్దరు మాత్రమే నామినేషన్ లోకి వచ్చారు. మరి రేపటి ఎపిసోడ్ లో హౌస్ లో ఎంత మంది కంటెస్టెంట్స్ నామినేషన్లోకి వస్తారో చూడాలి మరి.