English | Telugu

సంజనా గల్రానీ : ఫుటేజ్ తో నాకేం పని.. నన్ను జనాలు గుర్తుపడతారు

బిగ్ బాస్ సీజన్-9 మూడవ రోజు సెలెబ్రిటీలకి తప్పని తిండి కష్టాలు.. ఓనర్స్ పర్మిషన్ తో ఏ పండో, బిస్కెట్సో తిని పూట గడుపుతున్నారు. ఇక నామినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్ మొదట దశగా కామనర్స్ అయిన ఓనర్స్ అందరిని డిస్కషన్ చేసుకోమన్నారు. సెలబ్రిటీస్ లో నుండి ఒకరిని నామినేట్ చెయ్యమని బిగ్ బాస్ ఆదేశిస్తాడు.

ఇక ఓనర్స్ అందరు డిస్కషన్ చేసుకొని సంజన పేరు చెప్తారు. మీకు ఓక పని చెప్పినప్పుడు.. నా వల్ల కాదు.. కుకింగ్ చెయ్యను.. ఓన్లీ వేడి వాటర్ పెట్టిస్తానని చెప్పారు. ఆ టాపిక్ నే నిన్న, ఇవ్వాల సాగదీసారని మనీష్ పాయింట్స్ అన్ని క్లియర్ గా చెప్తాడు. మీరు బ్యాక్ బిచ్చింగ్ చేశారని సంజనతో ప్రియ అంటుంది. ఆ వర్డ్ ఉపయోగించకు.. చాలా పెద్ద వర్డ్ అని తనమీద సంజన సీరియస్ అవుతుంది. ఆ తర్వాత సంజన ఒంటరిగా తనలో తనే మాట్లాడుకుంటుంది.. ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోవద్దు వదిలెయ్యాలని అనుకుంటుంది.

కాసేపటికి సంజన దగ్గరికి తనూజ వస్తుంది. అలా మొహం పైన అంత హర్టింగ్ గా ఎవరైనా మాట్లాడతారా అని ఏడుస్తుంది. ప్రియ అన్నట్లుగానే సంజన బ్యాక్ బిచ్చింగ్ చేస్తుంది. తన టీమ్ వాళ్ళతో దమ్ము శ్రీజ గురించి డిస్కషన్ చేస్తుంది. నన్ను ఫుటేజ్ కోసం చేస్తున్నానని అంటుందా.... నాకేం అవసరం.. ఆల్రెడీ నేను అందరికి తెలుసు.. ఎవరికి కావాలి ఫుటేజ్.. నేను సెలబ్రిటీ అన్నట్లు సంజన పొగరుగా మాట్లాడుతుంది. ఒక కంటెస్టెంట్ లో ఇన్ని వెరైయేషన్సా.. సంజన గల్రానీ స్మార్ట్ గేమ్ అంతా మూడు రోజుల్లోనే బయటపడింది.


Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.