హీరో నాని క్లాస్ లో నిద్రపోయేవాడు...రివీల్ చేసిన టీచర్ సుందరమ్మ
జయమ్ము నిశ్చయమ్మురా - సెలబ్రిటీ టాక్ షో బై జగపతి బాబు...ప్రతీ ఎపిసోడ్ చాలా యూనిక్ గా ఉంటోంది. అలా ఇప్పటి వరకు నాగార్జున, శ్రీలీలని ఇంటర్వ్యూ చేశారు. ఇక నాని కూడా ఈ టాక్ షోకి ఇన్వైట్ చేశారు. "నేను 5th క్లాస్ టైంలో కొత్త స్కూల్ కి వచ్చాను. నాకు ఇంగ్లీష్ రాదు. మిగతా వాళ్ళు ఇంగ్లీష్ బాగా మాట్లాడేవాళ్ళు. తెలుగులో మాట్లాడితే ఫైన్ వేసేవాళ్ళు. ఆ టైములో నాకు సపోర్ట్ చేసిన టీచర్స్ గౌరీ , సుందరమ్మ టీచర్ . వాళ్ళు నాకు బాగా ఇష్టం. చాలామంది సార్లు పేర్లు గుర్తున్నాయి కానీ అందరూ నన్ను బాగా ఉతికారు. అందుకే ఆ పేర్లు చెప్పట్లేదు.