Jayam serial : వినాయకుని పూజకి సిద్ధమైన గంగ.. రుద్ర, శకుంతల కలుస్తారా!
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -41 లో.. ఇంట్లో వినాయకుడి పూజ చేయించి శకుంతలకి రుద్రపై ఉన్న కోపాన్ని పోగొట్టాలనుకుంటుంది గంగ. అదంతా ఈజీ కాదని ఇషిక, వీరు అంటారు. మనం ప్రయత్నం చేస్తేనే కదా అవుతుందో లేదో తెలిసేదని గంగ అంటుంది. తను వెళ్ళిపోయాక ఇషిక, వీరు మాట్లాడుకుంటారు. ఈ గంగ చాలా ఎక్స్ ట్రా చేస్తుంది.. రుద్ర, శకుంతల అత్తయ్యని కలపాలని ట్రై చేస్తుంది.. అలా జరగకుండా చెయ్యాలని వీరు, ఇషిక అనుకుంటారు.