ఛీ ఈ పెద్దోళ్ళకు మన ప్రేమ అర్ధమే కాదు...
ఫ్యామిలీ స్టార్ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షో న్యూ లవ్ వెర్సెస్ ఓల్డ్ లవ్ పేరుతో ఈ షోని ప్లాన్ చేశారు. పాత జంటలతో కొత్త జంటలు కూడా వచ్చారు. శ్రీవాణి - విక్రమాదిత్య, లాస్య-మంజునాథ్, మహేశ్వరి- శివ నాగ్, ప్రియాంక జైన్ - శివ్, పంచ్ ప్రసాద్ - సునీత, ధరణి-ప్రశాంత్ వచ్చారు. ప్రేమ గురించి రకరకాలుగా చెప్పుకొచ్చారు. "ప్రేమ అంటే వాళ్ళది కాదు మాది ..మొన్న ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వాళ్ళు ఫోన్ చేశారు. అందులో లవ్ అనే పదం తీసేసి లాస్య - మంజునాథ్ అని పెట్టమన్నాను" అంటూ తమ లవ్ ఎంత గొప్పదో చెప్పుకొచ్చింది లాస్య. ఇక శివనాగ్ వచ్చి "మొన్న మేము బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఏ పాజిటివ్, ఓ పాజిటివ్ కాదు పి పాజిటివ్ వచ్చింది అంటే ప్రేమ పాజిటివ్ వచ్చింది" అని చెప్పాడు. "మళ్ళీ మా బ్లడ్ టెస్ట్ లో రక్త కణాలు లేవండి.. మొత్తం ప్రేమ కణాలే ఉన్నాయి అవి కూడా హార్ట్ షేప్ లో ఉన్నాయి. ఇక జెంట్స్ అంతా అమ్మాయిల్లా గెటప్స్ వేసుకుని డాన్స్ చేస్తూ ఫన్ క్రియేట్ చేశారు.