English | Telugu

Karthika Deepam2 : జ్యోత్స్న అలా చేసిందని కనుక్కున్న కార్తీక్.. దీప చెంపచెల్లుమనిపించిన సుమిత్ర!

Karthika Deepam2 : జ్యోత్స్న అలా చేసిందని కనుక్కున్న కార్తీక్.. దీప చెంపచెల్లుమనిపించిన సుమిత్ర!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -295 లో... టైమ్ కి కార్తీక్ వచ్చి దీపని సేవ్ చేస్తాడు. శౌర్యని కాపాడడానికి వెళ్తాడు. అక్కడ రౌడీ లు శౌర్యపై ఎటాక్ చేయబోతుంటే కార్తీక్ వాళ్ళని కొడుతాడు. ఎవరు ఇలా చెయ్యమన్నారని కార్తీక్ వాళ్ళని అడుగుతాడు. వాళ్ళు చెప్పకుండా పారిపోతారు. శౌర్యని తీసుకొని దీప దగ్గరికి వెళ్తాడు. వాళ్ళని తీసుకొని కార్తీక్ ఇంటికి వెళ్తాడు. మరొకవైపు సుమిత్ర జ్యోత్స్న కి పాలు తీసుకొని వస్తుంది. ఆ లోపు జ్యోత్స్న గోడదూకి సుమిత్ర గదిలోకి వెళ్తుంది.

Eto Vellipoyindhi Manasu : రామలక్ష్మినే ప్రిన్సిపల్ అని చెప్పిన సందీప్.. సీతాకాంత్ తెలుసుకుంటాడా!

Eto Vellipoyindhi Manasu : రామలక్ష్మినే ప్రిన్సిపల్ అని చెప్పిన సందీప్.. సీతాకాంత్ తెలుసుకుంటాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -342 లో..... సీతాకాంత్ రామ్ దగ్గరికి వస్తాడు. రాగానే ఈ రోజు నీలాగా మిస్ ముందు చేసాను. దాంతో మిస్ నన్ను దగ్గరికి తీసుకొని కన్నీళ్లు పెట్టుకుందని సీతాకాంత్ తో రామ్ చెప్పగానే.. నాకు తెలుసు రామలక్ష్మి నువ్వు రామలక్ష్మివే అని సీతాకాంత్ అనుకుంటాడు. ఆ తర్వాత రామ్ ని సీతాకాంత్ పడుకోపెడతాడు. సీతాకాంత్ రామలక్ష్మితో ఉన్న జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటాడు. ఆ తర్వాత ఏదో ఆలోచిస్తూ ఈ విధంగా చేస్తే రామలక్ష్మి బయటపడుతుందని సీతాకాంత్ అనుకుంటాడు.

ఇంద్రజ నోటా పవన్ కళ్యాణ్ మాటా...డొక్కా సీతమ్మ నిజంగా అన్నపూర్ణాదేవినే..

ఇంద్రజ నోటా పవన్ కళ్యాణ్ మాటా...డొక్కా సీతమ్మ నిజంగా అన్నపూర్ణాదేవినే..

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో చూస్తే ఎవ్వరికైనా కళ్ళు చెమ్మ కాక మానవు. ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఉమెన్స్ డే. ఈరోజున ఈ షో లేడీస్ స్పెషల్ ఎపిసోడ్ గా రాబోతోంది. అలాగే అందరికీ ఆకలి తీర్చే అమ్మ డొక్కా సీతమ్మ తల్లిని అందరూ స్మరించుకున్నారు. నిజంగా ఆమె గురించి పరిచయం చేసిందే పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం అయ్యాక కూడా ఆయన ఆ తల్లిని ఎన్నో సార్లు స్మరించుకున్నారు. పవన్ కళ్యాణ్ తన ప్రతీ ప్రసంగంలో ఆమెను తలుచుకోకుండా ఉండరు...ఏ దానానికి ఆ దానం గొప్పది కానీ  అలాంటి దానాల్లోకెల్లా అన్నదానం ఇంకా గొప్పది. అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా వచ్చిన వాళ్లకు అన్నం పెట్టి ఆకలి తీర్చిన ఆ మహనీయురాలి గురించి పెద్దగా ఎవరికీ తెలీదు. పవన్ కళ్యాణ్ ఒక్కరే ఆమె గురించి తెలిసేలా చేసారు. ఆ తరువాత ఇంద్రజ ఆ విషయాన్ని ప్రస్తావించారు. "డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆవిడ పేరుతో అన్నదానం జరిపించాలని అని చెప్పిన తర్వాత ఇప్పుడిప్పుడే ఆవిడ మీద అందరికీ ఒక అవగాహన వస్తోంది" అని చెప్పారు.