English | Telugu

ఏకాంతంగా చీక‌ట్లో.. య‌ష్‌, వేద‌!

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ జంట‌గా న‌టిస్తున్నారు. బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, మిన్ను నైనిక‌, ఆనంద్‌, సులోచ‌న‌, వ‌ర‌ద‌రాజులు త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ధారులు. కొంత కాలంగా స్టార్ మా లో న్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ ఆత్యంతం ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో సాగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. వేద‌, య‌ష్ ల మ‌ధ్య ప్రైవ‌సీ వుండాల‌ని, ఇద్ద‌రి మ‌ధ్య వున్న దూరం త‌గ్గించాల‌ని ఖుషీ ప్లాన్ చేస్తుంది. ఇంట్లో వాళ్లంద‌రికి బ‌య‌టికి వెళ‌దామ‌ని చెప్పి య‌ష్, వేద‌ల‌ని ఇంట్లో పెట్టేసి వారికి తెలియ‌కుండానే తాళం వేసి బ‌య‌టికి వెళ్లిపోతుంది.

దీంతో ఒంట‌రిగా ఇంట్లో లాక్ అయిపోయిన య‌ష్ వేద ఏం చేయాలో తెలియ‌క ఆలోచిస్తూ వుంటారు. ఇదే స‌మ‌యంలో ఒక‌రి గురించి ఒక‌రు తెలుసుకుంటారు. ఒక‌రిపై ఒక‌రికున్న ప్రేమ గురించి ఒక‌రికి ఒక‌రు వ్య‌క్తం చేసుకుంటారు. ఆ త‌రువాత ఇద్ద‌రు కరెంట్ పోవ‌డంతో క్యాండిల్ లైట్ డిన్న‌ర్ చేస్తారు. ఆ త‌రువాత య‌ష్ కి నిద్ర వ‌స్తుంటుంది. ప‌వ‌ర్ లేక‌పోవ‌డంతో ఉక్క‌పోత‌తో ఇబ్బంది ప‌డుతూ వుంటాడు. అదే స‌మ‌యంలో వేద త‌న కొంగుతో విసురుతూ ప‌డుకోమంటుంది. ఇదే క్ర‌మంలో ఇద్ద‌రూ ఒక‌రి భుజంపై ఒక‌రు త‌ల పెట్టుకుని ప‌డుకుంటారు.

ఇంత‌లో దొంగ ఎంట్రీ ఇస్తాడు. ఇద్ద‌రు ప‌డుకొని వుండ‌టంతో ప‌క్క‌నే కూర్చుని కామెడీ చేయ‌డం మొద‌లు పెడ‌తాడు. వెంట‌నే మెల‌కువ వ‌చ్చిన య‌ష్ వాడిని చూసి షాక్ అవుతాడు. య‌ష్ ని చూసిన దొంగ గ‌ట్టిగా అరిచేస్తాడు. ఆ అరుపులో వేద కు మెల‌కువ వ‌స్తుంది. ఆ త‌రువాత కూడా దొంగోడే దొంగ దొంగ అని అర‌వ‌డం మొద‌లు పెడ‌తాడు. దాంతో వేద అక్క‌డ‌కి నుంచి వెళ్లిపోయి వాడిని కొట్ట‌డానికి క్రికెట్ బ్యాట్ తీసుకొస్తుంది. అది చూసిన దొంగ ఏంటి సార్ మీ వైవ్ ఇంత వైలెంట్ గా వుందంటాడు. క‌ట్ చేస్తే మాళ‌విక‌, అభిమ‌న్యు.. కైలాష్ ని విడిపించేందుకు జైలుకు వెళ‌తారు. అయితే కైలాష్ క‌న్ను మాళ‌విక‌పై ప‌డుతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.