English | Telugu

‘ఇద్దరు పిచ్చోళ్ళు కలిసి డాన్స్ చేస్తే ...ఇలా ఉంటదన్నమాట’ అంటున్న నెటిజన్స్

స్మాల్ స్క్రీన్ పై అవినాష్, శ్రీముఖి ఎప్పుడు కొత్త కొత్త జోక్స్ తో షోస్ లో సందడి చేస్తూనే ఉంటారు. అవినాష్, శ్రీముఖి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా. అవినాష్ పెళ్ళిలో శ్రీముఖి చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ లో ఇద్దరూ మంచి డాన్సులతో హంగామా చేస్తూ ఉంటారు. శ్రీముఖి చేసిన హెల్ప్ వల్లనే తాను బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగలిగానని ఎప్పుడు చెప్తూ ఉంటాడు అవినాష్. వీళ్ళిద్దరూ కలిసి చేసే డాన్స్ వీడియోస్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉంటాయి. ఇప్పుడు తాజాగా పల్సర్ బైక్ మీద రా మోవ అనే సాంగ్ కి వీళ్ళిద్దరూ డాన్స్ చేసి దుమ్ములేపేసారు.

రామ్, కృతిసెట్టి నటించిన ది వారియర్ మూవీలో బైక్ సాంగ్ కి వేసిన స్టెప్పులనే ఈ సాంగ్ కి వేశారు శ్రీముఖి, అవినాష్. ఇక ఈ వీడియోని శ్రీముఖి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. "ఇద్దరు పిచ్చోళ్ళు కలిసి డాన్స్ చేస్తే ఇలా ఉంటదన్నమాట", శ్రీముఖి చాలా సన్నబడినట్టు కనిపిస్తోంది" "ఇంకా నిద్ర పోకుండా ఈ డాన్సులేమిటి" అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Karthika Deepam2: వైరాతో జ్యోత్స్న డీలింగ్.. కార్తీక్ కి డౌట్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -544 లో.....శౌర్యకి దీప భోజనం తినిపిస్తుంది. అది చూసి కొడుకు కోడలితో చెల్లి మాట్లాడుతలేనట్లు ఉందని అనసూయ అంటుంది. వాళ్లే దాక్కొని తిరుగుతున్నారని కాంచన అంటుంది. శౌర్య వెంట భోజనం తినమని దీప పరుగెడుతుంది. శౌర్య అలా అమ్మని పరిగెత్తించవచ్చా.. ఇప్పుడు అమ్మ కడుపులో బేబీ ఉంది కదా తనకి ఆయాసం వస్తుంది ఇకనుండి నువ్వే భోజనం చెయ్యాలని కాంచన అనగానే.. నువ్వు మంచి నానమ్మవి కాదు నిన్ను తాతయ్య దగ్గరికి పంపించాలి.. మా అమ్మ నాకు తినిపించకుండా చేస్తున్నావని శౌర్య అంటుంది.

Illu illalu pillalu: ఇంగ్లీష్ టీచర్ గా శ్రీవల్లి.. ప్రేమ, నర్మద ప్లాన్ సూపర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -345 లో... భాగ్యం, ఆనందరావు ఇద్దరు రామరాజు ఇంటికి శ్రీవల్లి డూప్లికేట్ సర్టిఫికేట్లు తీసుకొని వస్తారు. అవి ప్రేమ చూసి డూప్లికేట్ సర్టిఫికేట్లు అని చెప్పదు. ఇంకేంటి మావయ్య మీరు మీకు తెలిసిన కాలేజీ ప్రిన్సిపల్ కి ఫోన్ చెయ్యండి.. అక్క  ఇంగ్లీష్ టీచర్ గా జాయిన్ చెయ్యండి అని ప్రేమ అంటుంది. రామరాజు ఫోన్ చేస్తుంటే కావాలనే శ్రీవల్లి తుమ్ముతుంది. ఇప్పుడే వద్దు మావయ్య అంటుంది. అయినా రామరాజు వినకుండా ఫోన్ చేసి ప్రిన్సిపల్ తో మాట్లాడతాడు.