English | Telugu

మా ఆయనకు రొమాన్స్ కి సంబంధమే లేదు అంటున్న ఖుష్భు

ఎక్స్ట్రా జబర్దస్త్ ఈ వారం ఫుల్ ఎంటర్టైన్ చేసేసింది. ఈ షోకి రైటర్ పద్మభూషణ్ మూవీ టీమ్ సుహాస్, టీనా ప్రొమోషన్ లో భాగంగా వచ్చేసారు. ఇక ఈ ఎపిసోడ్ లో మునిగినపాలెం స్కిట్ అందరినీ కడుపుబ్బా నవ్వించింది. రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత, ప్రవీణ్ కలిసి ఈ స్కిట్ వేశారు. ఇటీవల వస్తున్న వరదల బ్యాక్ డ్రాప్ లో ఈ స్కిట్ పెర్ఫార్మ్ చేశారు. నా ప్రేమ నీ విషయంలో హద్దు దాటినట్టు తుఫాన్ తీరం దాటింది కదా అందుకే ఈ వరదలు అంటాడు రాకేష్. సుజాత సిగ్గు పడుతూ ఉంటుంది. వర్షం పడినప్పుడే పిడుగులు ఎందుకు పడతాయ్..అని సుజాత అడిగేసరికి కొత్త జంట హగ్ చేసుకోవడానికి ప్రకృతి ఇచ్చే ఒక అవకాశం అనేసరికి ఖుష్భు తల పట్టుకుంటుంది. ఖుష్భు గారికి ఎక్కడో బాగా తగిలింది అనేసరికి "లేదండి మా ఆయనకి రొమాన్స్ కి ఎలాంటి సంబంధం లేదు అంటుంది " తర్వాత ఊరు మునిగిపోతూ ఉండే సరికి ప్రవీణ్ పడవేసుకుని వస్తాడు. ఎలాగైనా కాపాడాలని రాకేష్ అడిగేసరికి వెళ్లి ఆధార్ కార్డు జిరాక్స్ తెమ్మని చెప్తాడు.

సుజాత, రాకేష్ ఇద్దరు కూడా నువ్వే నా ఆధార్ కార్డు అంటే నువ్వే నా ఆధార్ కార్డు అనుకుంటూ ఉంటారు. ఇంతలో మాన్ హోల్ అనే పేరు ఎందుకొచ్చింది అని రాకేష్ అడిగేసరికి మాన్ తప్ప ఆ హోల్ లో ఎవరూ పట్టరు కాబట్టి మాన్ హోల్ అనే పేరొచ్చిందంటూ ప్రవీణ్ చెప్తాడు. ప్లీజ్ ఒక్క సారి పడవ ఆపండి నా సన్న పిన్ను చార్జర్ మర్చిపోయి వచ్చాను అంటాడు ఆ మాటకు అందరూ నవ్వేస్తారు. ఇంతలో ప్రవీణ్ పడవను పక్కన పెట్టి వరదల్లో నడుచుకుంటూ వస్తాడు. సర్ మీరు నీళ్ళల్లో ఎలా నడుస్తున్నారు అనేసరికి నాకు వీసా ఉంది నీళ్ళల్లో నేను నడగలను అంటూ పంచ్ డైలాగ్ వేస్తాడు. ఇంతలో వరదల్లో వాషింగ్ మెషిన్, టీవీ, ఫ్రిజ్ అన్ని కొట్టుకొస్తూ ఉంటాయి.

దాంతో ప్రవీణ్ మీకు ఎం కావాలి వాటిని తీసుకెళ్లండి అనేసరికి రాకేష్ చెవిలోంచి పొగలొస్తుంటాయి. ఫైనల్ గా రాకేష్ ఎంటర్టైన్మెంట్ కొంచెం మిస్ అయ్యింది అనేసరికి ఓ లేశ ఓ లేశ అని పాట పడతాడు ప్రవీణ్. ఇంతలో పడవలోకి నీళ్లు వచ్చేస్తాయి. అదేంటి పడవలోకి నీళ్లు వస్తున్నాయి అనేసరికి అదేగా చెప్తున్నా హోల్ ఏసా హోల్ ఏసా అంటున్న కదా అనేసరికి అందరూ ఒక్కసారి షాక్ ఐపోతారు.

Karthika Deepam2: వైరాతో జ్యోత్స్న డీలింగ్.. కార్తీక్ కి డౌట్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -544 లో.....శౌర్యకి దీప భోజనం తినిపిస్తుంది. అది చూసి కొడుకు కోడలితో చెల్లి మాట్లాడుతలేనట్లు ఉందని అనసూయ అంటుంది. వాళ్లే దాక్కొని తిరుగుతున్నారని కాంచన అంటుంది. శౌర్య వెంట భోజనం తినమని దీప పరుగెడుతుంది. శౌర్య అలా అమ్మని పరిగెత్తించవచ్చా.. ఇప్పుడు అమ్మ కడుపులో బేబీ ఉంది కదా తనకి ఆయాసం వస్తుంది ఇకనుండి నువ్వే భోజనం చెయ్యాలని కాంచన అనగానే.. నువ్వు మంచి నానమ్మవి కాదు నిన్ను తాతయ్య దగ్గరికి పంపించాలి.. మా అమ్మ నాకు తినిపించకుండా చేస్తున్నావని శౌర్య అంటుంది.

Illu illalu pillalu: ఇంగ్లీష్ టీచర్ గా శ్రీవల్లి.. ప్రేమ, నర్మద ప్లాన్ సూపర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -345 లో... భాగ్యం, ఆనందరావు ఇద్దరు రామరాజు ఇంటికి శ్రీవల్లి డూప్లికేట్ సర్టిఫికేట్లు తీసుకొని వస్తారు. అవి ప్రేమ చూసి డూప్లికేట్ సర్టిఫికేట్లు అని చెప్పదు. ఇంకేంటి మావయ్య మీరు మీకు తెలిసిన కాలేజీ ప్రిన్సిపల్ కి ఫోన్ చెయ్యండి.. అక్క  ఇంగ్లీష్ టీచర్ గా జాయిన్ చెయ్యండి అని ప్రేమ అంటుంది. రామరాజు ఫోన్ చేస్తుంటే కావాలనే శ్రీవల్లి తుమ్ముతుంది. ఇప్పుడే వద్దు మావయ్య అంటుంది. అయినా రామరాజు వినకుండా ఫోన్ చేసి ప్రిన్సిపల్ తో మాట్లాడతాడు.