English | Telugu

వాళ్ళు పత్తి ఏరేవాళ్ళా ? ఆర్టిస్టులా?

బుల్లితెర మీద రెమ్యూనరేషన్ గురించి ప్రొడక్షన్ ఫుడ్ గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఒక షోలో తక్కువిస్తున్నారంటూ ఇంకో షోకి వెళ్లిపోవడం.. ఫుడ్ బాలేదని ఇంటర్వ్యూల్లో చెప్పడం తెలిసిన విషయమే. ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ బోనాల జాతరలో రెమ్యూనరేషన్ గొడవ మళ్ళీ మొదలయ్యింది. ఆది ఈ రెమ్యూనరేషన్స్ మీద కౌంటర్ లు వేస్తాడు. ఈ ఎపిసోడ్ లో మధుప్రియ ఫామిలీ, కనకవ్వ వచ్చేసారు. కనకవ్వతో ఆది, నాటి నరేష్ ఫన్ చేస్తారు. ఆ తరువాత ఆది కనకవ్వ ఇట్రా అని పిలిచి వీళ్లెవరో తెలుసుగా వర్ష, భాను ..వీళ్ళను ఎక్కడైనా చూసావా ? అని అడుగుతాడు.

"ఆ చూసాను పత్తి ఏరడానికి మా ఊరికొచ్చినప్పుడు చూసా" అనేసరికి వాళ్ళ మొహాలు మాడిపోతాయి. "వాళ్ళు పత్తి ఏరేవాళ్ళు కాదు ఆర్టిస్టులు అంటాడు. వర్షకు 2 వేలు ఇస్తే చాలు..భానుకు 200 లు ఇచ్చి రెండు పూటలా భోజనం పెడితే చాలు" అని వాళ్ళ పరువు తీసేతాడు ఆది. భాను వెంటనే రియాక్ట్ అయ్యి ఆదిని పక్కకు తోసేస్తుంది. వెంటనే వర్ష మేమొచ్చాకే పండగ అందం వచ్చింది తెలుసా అంటుంది..కనకవ్వ వర్ష తెలుసుగా నీకు అంటాడు. కామెడీ చేస్తదా అని అడుగుద్ది కనకవ్వ. కామెడీ చేయదు. మధ్యమధ్యలో విసిగిస్తూ ఉంటది అని అంటాడు. "ఏదైమైనా సరే స్టేజి చాలా నిండుగా ఉంది" అంటుంది హరిత. "స్టేజి నిండుగా ఉండాలంటే ఎవరో అక్కర్లేదు మీరు, నవీన ఇద్దరు ఉంటె చాలు" అంటూ పంచ్ వేస్తాడు ఆది.

Karthika Deepam2: వైరాతో జ్యోత్స్న డీలింగ్.. కార్తీక్ కి డౌట్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -544 లో.....శౌర్యకి దీప భోజనం తినిపిస్తుంది. అది చూసి కొడుకు కోడలితో చెల్లి మాట్లాడుతలేనట్లు ఉందని అనసూయ అంటుంది. వాళ్లే దాక్కొని తిరుగుతున్నారని కాంచన అంటుంది. శౌర్య వెంట భోజనం తినమని దీప పరుగెడుతుంది. శౌర్య అలా అమ్మని పరిగెత్తించవచ్చా.. ఇప్పుడు అమ్మ కడుపులో బేబీ ఉంది కదా తనకి ఆయాసం వస్తుంది ఇకనుండి నువ్వే భోజనం చెయ్యాలని కాంచన అనగానే.. నువ్వు మంచి నానమ్మవి కాదు నిన్ను తాతయ్య దగ్గరికి పంపించాలి.. మా అమ్మ నాకు తినిపించకుండా చేస్తున్నావని శౌర్య అంటుంది.

Illu illalu pillalu: ఇంగ్లీష్ టీచర్ గా శ్రీవల్లి.. ప్రేమ, నర్మద ప్లాన్ సూపర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -345 లో... భాగ్యం, ఆనందరావు ఇద్దరు రామరాజు ఇంటికి శ్రీవల్లి డూప్లికేట్ సర్టిఫికేట్లు తీసుకొని వస్తారు. అవి ప్రేమ చూసి డూప్లికేట్ సర్టిఫికేట్లు అని చెప్పదు. ఇంకేంటి మావయ్య మీరు మీకు తెలిసిన కాలేజీ ప్రిన్సిపల్ కి ఫోన్ చెయ్యండి.. అక్క  ఇంగ్లీష్ టీచర్ గా జాయిన్ చెయ్యండి అని ప్రేమ అంటుంది. రామరాజు ఫోన్ చేస్తుంటే కావాలనే శ్రీవల్లి తుమ్ముతుంది. ఇప్పుడే వద్దు మావయ్య అంటుంది. అయినా రామరాజు వినకుండా ఫోన్ చేసి ప్రిన్సిపల్ తో మాట్లాడతాడు.