English | Telugu

సుధీర్ నన్నెప్పుడు పెళ్లి చేసుకుంటావ్ ? అంటూ నిలదీసిన భావన లాస్య

సూపర్ సింగర్ జూనియర్స్ ఈ వారం సరికొత్తగా అలరించడానికి సిద్ధమయ్యింది. ఈ షోలో పిల్లల పాట..తారల ఆట అనే టైటిల్ తో రాబోతోంది. పిల్లలు ఎంచుకుని పాడే సాంగ్స్ కి సీరియల్స్ నటీ నటులు వచ్చి డాన్స్ చేయడం చాలా అద్భుతంగా ఉంది. ఇక అనసూయ పింక్ శారీలో అచ్చ తెలుగు అమ్మాయిలా సుధీర్ తో కలిసి కామెడీ బాగా పండించింది. అనసూయ ఆల్ రౌండర్ అని ఇప్పటికే నిరూపించుకుంది. ఇక ఇప్పుడు ఈ షోలో మనోతో కలిసి సాంగ్ షేర్ చేసుకుని అద్భుతంగా పాడి వినిపించింది. "సరసాలు చాలు శ్రీవారు" అనే పాట ఇద్దరూ కలిసి పాడతారు. అనసూయ సాంగ్ మీద సుధీర్ జడ్జిమెంట్ ఇస్తాడు. అద్భుతంగా పాడావ్.. హహ అన్నచోట నాలుగు సార్లు హహహహ అనాలి ..ఐనా బాగా పాడారు ఒకసారి ఇట్రామ్మ అంటూ హగ్ ఇస్తా అన్నట్టుగా రెండు చేతులు చాపుతాడు. మనో గారు అనసూయ నువ్వు ఉండమ్మా నేను వెళ్తా అని సుధీర్ దగ్గరకు వెళ్తారు.

అలా అనసూయకు హగ్ ఇద్దామనుకున్న సుధీర్ ప్లాన్ బెడిసికొట్టింది. తర్వాత మల్లి నిండు జాబిల్లి సీరియల్ నటీమణులు వచ్చి "అదిరేటి డ్రెస్సు మేమేస్తే" సాంగ్ కి డాన్స్ చేస్తారు భావన లాస్య, దీప జగదీశ్. సాంగ్ తర్వాత దీప వచ్చి అన్నయ్య.. సుధీర్ అన్నయ్య అని పిలిచేసరికి. వద్దు నన్ను అలా పిలవద్దు అంటాడు సుధీర్. ఇంతలో భావన లాస్య వచ్చి సుధీర్ నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావ్ ? అని అడుగుతుంది. పెళ్లి అనే మాట వినేసరికి ఆ అమ్మాయి నుంచి తప్పించుకోవడానికి ఫోన్ లో వేరేవాళ్లతో కాల్ మాట్లాడుతున్నట్టు ఆ ప్లేస్ నుంచి తప్పించుకుంటాడు సుధీర్. ఇలా ఈ ఎపిసోడ్ రెండు తెలుగు రాష్ట్రాలను అలరించడానికి రాబోతోంది.

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.