English | Telugu

బిగ్ బాస్ సీజ‌న్ 6 ఓటీటీలో కూడానా?

బుల్లితెర‌పై నెంబ‌ర్ వ‌న్ రియాలిటీ షోగా దూసుకుపోతున్న షో బిగ్ బాస్. ఇప్ప‌టి వ‌ర‌కు అన్ని భాష‌ల్లో ప్ర‌సార‌మైన ఈ షో సూప‌ర్ హిట్ అనిపించుకుంది. మంచి క్రేజ్ ని, రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్ ని ద‌క్కించుకుని హాట్ టాపిక్ గా మారింది. విమ‌ర్శ‌లతో పాటు ప్ర‌శంస‌లు ద‌క్కించుకుని వార్త‌ల్లో నిలిచింది. తెలుగులో ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు సీజ‌న్ లు విజ‌య‌వంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ రియాలీటీ షో 6వ సీజ‌న్ త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోతోంది. దీనికి ముందు ఓటీటీ వెర్ష‌న్ పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక దారుణంగా ఫ్లాప్ అయింది.

డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో 24 గంట‌ల పాటు ఓటీటీ వెర్ష‌న్ ని స్ట్రీమింగ్ కి పెట్టారు. ముందు మూడు నాలుగు రోజులు టెక్నిక‌ల్ అంశాల కార‌ణంగా ఓటీటీ రియాలిటీ షో నిరాశ‌ప‌రిచింది. ఆ త‌రువాత మొద‌లైనా పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఇదిలా వుంటే ప్ర‌స్తుతం బిగ్ బాస్ సీజ‌న్ 6 కోసం స‌న్నాహాలు మొద‌లు పెట్టారు. త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్న నేప‌థ్యంలో తాజాగా మేక‌ర్స్ కొత్త లోగోకు సంబంధించిన వీడియోని విడుద‌ల చేశారు. ఇదే సంద‌ర్భంగా ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త బ‌య‌టికి వ‌చ్చింది.

బుల్లితెర స్టార్ మాలో బిగ్ బాస్ సీజ‌న్ 6 ప్రసారం అవుతూనే ఓటీటీలోనూ 24 గంట‌ల వెర్ష‌న్ స్ట్రీమింగ్ కానుంద‌ట‌. అంటూ ఒకే షో రెండు చోట్ల రెండు ర‌కాలుగా ప్ర‌సారం కానుంద‌న్న‌మాట‌. టీవీలో గంట పాటు ప్ర‌సారం కానున్న ఈ షో ఓటీటీలో మాత్రం 24 గంట‌ల పాటు స్ట్రీమింగ్ కానుంద‌ని తెలిసింది. ఇందు కోసం డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ స‌న్నాహాలు చేస్తోందట‌. ఇక సీజ‌న్ 6 లో 17 నుంచి 18 మంది కంటెస్టెంట్ లు వుండే అవ‌కాశం వుంద‌ని, అంతే కాకుండా ఈ 18 మందిలో కామ‌న్ మ్యాన్ కూడా వుంటాడ‌ని ఇన్ సైడ్ టాక్‌.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.