సూపర్ సింగర్ జూనియర్ టైటిల్ విన్నర్ సుదీక్ష!
బుల్లి తెర చరిత్రలో ఎంతోమంది సూపర్ సింగర్స్‌ను వెలుగులోకి తీసుకొచ్చిన స్టార్ మా సూపర్ సింగర్ జూనియర్ పోటీల ఫైనల్స్ ముగిసాయి . 13 వారాలు 14 మంది జూనియర్స్ ఇందులో పోటీ పడ్డారు. ఇక ఈ షో ఫైనల్స్‌లోకి ఐదుగురు చేరుకున్నారు. ఇక ఈ ఫైనల్ ఈవెంట్ ఎంతో గ్రాండ్ లుక్ తో అదరగొట్టేసింది. ఈ ఎపిసోడ్‌కు మెయిన్ గెస్ట్స్ గా అక్కినేని నాగార్జున, బ్రహ్మానందంతో పాటు "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి" మూవీ యూనిట్ కృతిశెట్టి, సుధీర్ బాబు, ఇంద్రగంటి మోషనకృష్ణ వచ్చేసారు.