English | Telugu
చిరంజీవి గారు నాకెంతో గొప్ప సాయం చేశారు
Updated : Aug 28, 2022
మెహబూబ్ గురించి బుల్లి తెర ఆడియన్స్ కి కాస్త పరిచయమే. టిక్ టాక్ వీడియోస్ చేసుకుంటూ ఫేమస్ అయ్యేసరికి బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. హౌస్ లోకి వెళ్లి వచ్చాక తన పాపులారిటీ ఎంతో పెరిగిపోయింది. బిగ్ బాస్ సెలబ్రిటీ అయ్యాక వెబ్ సిరీస్ లు, ఈవెంట్స్, షోస్ చేస్తూ ఫుల్ బిజీ అయ్యాడు. ఐతే ఇటీవల వాళ్ళ అమ్మ చనిపోయిన విషయం అందరికీ తెలుసు.
తన తల్లిని ఎంత ప్రేమించేవాడో ఒక ఇంటర్వ్యూలో చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆగష్టు 5 తన జీవితం మర్చిపోలేని రోజు అంటూ చెప్పుకొచ్చాడు. "ఆ రోజు అమ్మకు షుగర్ ఎక్కువైపోయి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. నాకు ఫోన్ చేయగానే నేను హైదరాబాద్ నుంచి గుంటూరు బయల్దేరి వెళ్లాను. అమ్మ దగ్గరకు రావడానికి ఇంకా కొంత దూరమే ఉంది..అంతలోనే అమ్మ తుదిశ్వాస విడిచింది. లాస్ట్ ఇయర్ అమ్మీకి హెల్త్ బాగోకపోతే హాస్పిటల్ లో చేర్చాం. ఐతే అప్పుడు అమ్మకు ఇన్సూరెన్సుల మీద అస్సలు నమ్మకం ఉండేది కాదు. దాంతో అవేవి లేవు. అప్పుడు అమ్మకు హాస్పిటల్ లో రూ.13 లక్షలు ఖర్చు అయ్యింది. ఇక అదే టైములో మెగాస్టార్ చిరంజీవి గారు రూ.10 లక్షల చెక్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన డబ్బుతో నా దగ్గర ఉన్న డబ్బుతో అమ్మను కాపాడుకున్నాం" అంటూ చెప్పాడు మెహబూబ్.
"కానీ ఈ ఏడాది అమ్మ మమ్మల్ని విడిచి వెళ్ళిపోయింది. పేరెంట్స్ ని బాగా చూసుకోండి ..వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. వాళ్లకూ ఏం కావాలో ఇవ్వండి. వాళ్ళను హ్యాపీగా చూసుకోండి" అంటూ చాలా ఎమోషనల్ గా చెప్పాడు మెహబూబ్.