English | Telugu
నాన్న రోడ్డున పడేసిపోయాడు.. అమ్మ మమ్మల్ని పెంచింది!
Updated : Aug 27, 2022
'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో రాబోయే ఎపిసోడ్ లో గాజువాక డిపో లేడీ కండక్టర్ ఝాన్సీ చేసిన "పల్సర్ బైక్" సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. తన ఈ కష్టం వెనక ఎన్నో చెప్పుకోలేని బాధలున్నాయని ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. మూడు నెలలు గంజి అన్నం, ఆవకాయ్ తిని బతికానని చెప్పింది. "పోలీస్ కానిస్టేబుల్ గా చేసిన నాన్న మా కుటుంబాన్ని రోడ్డున పడేసి వెళ్ళిపోతే అమ్మ మమ్మల్ని వదిలిపెట్టకుండా పాన్ షాప్ పెట్టుకుని, ఉల్లిపాయలు అమ్మి చదివించింది" అని చెప్పింది. ఇన్ని కష్టాల మధ్యలో తాను 8th క్లాస్ చదివేటప్పుడు డాన్స్ నేర్చుకోవడం అలాగే ఎన్నో షోస్ లో ప్రైజెస్ విన్ ఐనట్లు చెప్పింది. ఎంతో మంది "కూతురు రోడ్డు మీద డాన్స్ చేసి సంపాదిస్తుంటే తింటున్నారా?"అంటూ అమ్మని, తమ్ముడిని హేళన చేశారని కన్నీళ్లు పెట్టుకుంది.
ఐతే ఇప్పుడు తన తమ్ముడిని ఎంబీఏ చదివించానని.. ఇప్పుడు హెచ్.ఆర్. మేనేజర్ గా చేస్తున్నాడంటూ గర్వంగా చెప్పుకుంది ఝాన్సీ. తమ కుటుంబాన్ని తిట్టిన వాళ్లంతా వెనక ఉంటే తాను మాత్రం ముందున్నానని చెప్పింది. తన భర్త తనకు ఎంతో సపోర్ట్ చేస్తారని అత్తింటి వాళ్ళు కూడా ఎంతో మంచివాళ్ళని చెప్పింది ఝాన్సీ. "చిరంజీవి గారి డాన్స్ చూస్తూ పెరిగాను కాబట్టి ఆయనలా కొంతైనా నేర్చుకోవాలని ఉంది" అంటూ చెప్పింది ఝాన్సీ. "కడుపు నింపుకోవాలంటే రెండు పనులు తప్పించిఏ పనైనా చేసి సంపాదించుకోవచ్చు" అంటూ చాలా ధైర్యంగా చెప్పింది. ఇప్పుడు ఝాన్సీ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈమె డాన్స్ కి ఫిదా ఐన నెటిజన్స్ కూడా ఈమెకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు.