English | Telugu

నీకు దమ్ముందా అంటూ ఆదికి ఛాలెంజ్ విసిరిన నయనిపవని!

వినాయక చవితి అంటే చాలు అందరిలో మంచి జోష్ వచ్చేస్తుంది...మంచి ఎనర్జీ నిండిపోతుంది. వాతావరణం కూడా ఫుల్ కలర్ ఫుల్ గా మారిపోతుంది. ఇక ఈ పండగంటే టీవీలో వచ్చే ఎంటర్టైన్మెంట్ షోస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇదివరకు రేడియో వింటూ పండగ పనులు చేసుకునేవారు..కానీ ఇప్పుడు పండగల ట్రెండ్ బిందాస్ గా మారిపోయింది. షోస్ చూస్తూ పండగ పనులు చేసుకుంటున్నారు. అందుకే బుల్లి తెర మీద నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ షోస్ అలా వస్తూనే ఉంటున్నాయి. ఇక ఇప్పుడు ఢీ-14 డాన్సింగ్ ఐకాన్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది.

ఇందులో పెర్ఫార్మెన్స్ లు మాములుగా లేవు ఈసారి. ఆది ఈ షోలో వినాయక చవితి చందాలు అడిగే వ్యక్తిగా నటించాడు. "టీం లీడర్స్ నుంచి చందాలు అడగడం మొదలు పెట్టు అంటూ ప్రదీప్ చెప్పేసరికి నయనిపావని దగ్గరికి వెళ్లి చందా అంటూ డబ్బా పెట్టేసరికి నాకు మధ్యాహ్నం భోజనంలోకి వెజ్ బిర్యాని కావాలి అంటుంది ..ప్రొడక్షన్ బాయ్ ని నేను కాదు..వాడు అంటూ అఖిల్ ని చూపిస్తాడు" ఆది. ఇకపోతే ఫస్ట్ రౌండ్ లో డాన్స్ పెర్ఫార్మెన్సులు అయ్యాక "సెకండ్ రౌండ్ కి ఆది, నయని పావని ఇద్దరూ ఎవరు గెలుస్తారంటూ పాట పెట్టుకుంటారు..రెండు లక్షలకు పైనే పాట సాగుతుంది... నీకు దమ్ముందా అని ఆదికి ఛాలెంజ్ విసిరేసరికి..ఆయన మెట్లెక్కి వస్తుంటేనే దమ్మొస్తది.. నువ్వేమో దమ్ముందా" అని మళ్ళీ అడుగుతావ్ ఏమిటి అంటూ పంచ్ డైలాగ్ వేస్తాడు అఖిల్.

తర్వాత "అమ్మా అమ్మా ..నే పసివాణ్ణమ్మా" అనే సాంగ్ కి జతిన్ చేసిన పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఆ పాటలో ఎక్స్ప్రెషన్స్, డైలాగ్స్ అన్ని కూడా అందరికీ కన్నీళ్లు తెప్పించేశాయ్. ఇలా ఈవారం వినాయక చవితి స్పెషల్ గా ఈ ఢీ - 14 అలరించబోతోంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.