English | Telugu

కృతికి ప్రపోజ్ చేయడానికి సుధీర్ విశ్వ ప్రయత్నం!?

బుల్లి తెర మీద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా సుడిగాలి సుధీర్ పేరు తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఇన్నేళ్ళుగా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయాడు. అతని ఫ్రెండ్స్ రాంప్రసాద్, గెటప్ శీను పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కన్నారు. ఐతే ఈ మధ్య కాలంలో సుధీర్ కి కూడా పెళ్లిపై ధ్యాస మళ్లినట్లుంది. ఏ షోలో అమ్మాయి కనిపించినా లైన్లో పెట్టడానికి తెగ ట్రై చేస్తున్నాడు. వాళ్లేమో "అన్నయ్యా"అంటూ వెళ్లిపోతున్నారు. ఇక ఇప్పుడు కృతిశెట్టి వెనక పడ్డాడు సుధీర్. సూపర్ సింగర్స్ గ్రాండ్ ఫినాలేకు 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' టీం వచ్చింది. ఫినాలే ఈవెంట్ స్టేజి మీద హోస్ట్స్ అనసూయ, సుడిగాలి సుధీర్, హీరో సుధీర్‌బాబు, డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ వున్నారు.

సుధీర్ ఇక్కడ కూడా పెళ్లిగోల మొదలెట్టేసాడు. "ఈ స్టేజి మీద పెళ్లికాని వాళ్ళు ఇద్దరే ఉన్నారు. అందులో ఒకరు కృతి శెట్టి, మరొకరు నేను" అంటూ స్టార్ట్ చేశాడు. కృతిశెట్టికి అత‌ను లైన్ వేస్తున్నాడన్న విషయం గమనించిన అనసూయ ముందు కృతి శెట్టికి ఎలాంటి భర్త కావాలో తెలిస్తే ఈజీ అవుతుందని హింట్ ఇచ్చింది. తనకు సపోర్టివ్ గా, పాజిటివ్ యాటిట్యూడ్ తో మంచి మనసున్నవాడు కావాల‌నీ, అన్నింటికీ మించి తనను బాగా చూసుకోవాలనీ చెప్పిందికృతి. ఈ లక్షణాలన్నీ తనలో ఉన్నాయని నిరూపించడానికి సుధీర్ ఆమెను తెగ ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేశాడు.

"అన్ని క్వాలిటీస్ తో పాటు కాస్త చబ్బీగా కూడా ఉండాలి" అని కృతి అనేసరికి, "నేను చబ్బీనే కావాలంటే పొట్ట చూడండి" అని సుడిగాలి సుధీర్ అనేసరికి "మరి ఇందాక సిక్స్ ప్యాక్ అని చెప్పావ్" అని కృతి అడిగింది. ఇలా కృతి, సుడిగాలి సుధీర్ మధ్య జరిగిన ఈ మ్యారేజ్ ప్రపోజల్ డ్రామా ఫుల్ ఎంటర్టైన్ చేసేసింది.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..