English | Telugu
నువ్వేమన్నా అందగత్తె అనుకుంటున్నావా?.. బుంగమూతి పెట్టుకున్న దీప్తి
Updated : Aug 28, 2022
దీప్తి సునైనా సోషల్ మీడియాలో మంచి ఫేమస్ పర్సన్. డబ్ మాష్ వీడియోస్ చేస్తూ తన కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత యూట్యూబర్ గా మంచి పేరు తెచ్చుకుంది. డాన్స్ వీడియోస్ చేస్తూ యూత్ లో క్రేజ్ పెంచుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ షో ద్వారా దీప్తి సునైనాకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక హౌజ్ నుంచి బయటికి వచ్చాకా తన క్రేజ్ ఏమీ తగ్గలేదు. ఇక దీప్తి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ పేజీలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ నెటిజన్స్ ప్రశ్నలకు కొంటెగా జవాబులు ఇస్తూ ఉంటుంది.
ఇటీవల దీప్తి " ఆస్క్ మీ ఏ కొషెన్" అంటూ తన స్టేటస్ లో పోస్ట్ చేసేసరికి ఒక కొంటె నెటిజన్ " నువ్వేమన్నా అంత అందగత్తె అనుకుంటున్నావా.. జిమ్ లో ఫొటోస్ పెడుతూ షో చేస్తున్నావ్ రోజూ.. చూడలేకపోతున్నాం" అని అనేసరికి "అందగత్తెలే పోవాలా బ్రో...జిమ్ కి" అని బుంగమూతి పెట్టుకుని మరీ ఆన్సర్ ఇచ్చింది.
అలాగే ఇంకో నెటిజన్ "ఎందుకు అన్నిటికి తిక్క ఆన్సర్స్ ఇస్తావ్" అనేసరికి " నాలో సెన్సాఫ్ హ్యూమర్ ఎంతుందో తెలుసుకోవడానికి" అంటూ ఆన్సర్ ఇచ్చింది. "నీ వెయిట్ ఎంత అన్నదానికి... ఎవరూ మోయలేనంత..నీ ఏజ్ ఎంత అనేసరికి ఎవరూ లెక్కపెట్టలేనంత " అంటూ కొంటెగా ఆన్సర్స్ ఇచ్చింది దీప్తి.