బిగ్బాస్ షో కోసం జెస్సీ డబ్బులిచ్చాడా?
బిగ్బాస్ సీజన్ 5 తెలుగు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు విమర్శలు ఎదుర్కొంటూనే వుంది. తాజాగా మరో ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ షోలోకి ఎంపికయ్యే కంటెస్టెంట్ల నుంచి నిర్వాహకులు డబ్బులు తీసుకుంటున్నారని, వారిచ్చే డబ్బుల ఆధారంగానే కంటెస్టెంట్లని నిర్వాహకులు ఎంపిక చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు ఓ కారణం కూడా వుంది. బిగ్బాస్ షోలో ఇప్పటి వరకు నటీనటులు, కమెడియన్లు, సింగర్లు, డ్యాన్స్ మాస్టర్లు, ట్రాన్స్ జెండర్లు మాత్రమే కంటెస్టెంట్లుగా ఎంపికయ్యారు.