English | Telugu
డాన్స్ ఇండియా డాన్స్ షోకి రాబోతున్న మహేష్ బాబు , సితార
Updated : Aug 29, 2022
మహేష్ బాబు ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వరుస సినిమాలతో ఎప్పుడూ ఎంతో బిజీగా గడుపుతూ ఉంటారు ఈ టాలీవుడ్ సూపర్ స్టార్. మహేష్ బాబు బయట ఎక్కడా పెద్దగా కనిపించరు. బుల్లి తెర మీద అసలే కనిపించరు. తన సినిమా ఈవెంట్స్ కి మాత్రమే వస్తూ ఉంటారు. మహేష్ బాబు కూతురు సితార మాత్రం వాళ్ళ నాన్నలా కాకుండా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. డాన్స్ చేస్తుంది, డైలాగ్స్ చెప్తుంది మొత్తానికి సోషల్ మీడియాలో తనకంటూ స్పెషల్ ఫ్యాన్ పేజీ క్రియేట్ చేసుకుంది. చిన్న వయసులోనే తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీని తెచ్చుకుంది. ఐతే ఇప్పుడు ఈ తండ్రి కూతుళ్లు కలిసి ఒక డాన్స్ షోకి రాబోతున్నట్టు సమాచారం.
దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తయ్యిందని తెలుస్తోంది.ఇకపోతే మహేష్ బాబు తన కూతురు సితార చేయి పట్టుకుని ఈ కార్యక్రమానికి వస్తున్నటువంటి వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ షూటింగ్ వీడియో ట్విట్టర్ లో ఉన్న మహేష్ బాబు ఫ్యాన్ పేజీలో కూడా పోస్ట్ చేశారు. డాన్స్ ఇండియా డాన్స్ షో హోస్ట్ అకుల్ బాలాజీ మహేష్ బాబుకి స్వాగతం పలుకుతుండగా సితారతో కలిసి మహేష్ నడుస్తూ వస్తున్న ఒక ఇమేజ్ ట్విట్టర్ లో ఫుల్ ట్రోల్ అవుతోంది. ఈ ఎపిసోడ్ కి సంబందించిన టీజర్ ని త్వరలో విడుదల చేయనున్నారు. మహేష్ బాబు సితారతో కలిసి ఒక తెలుగు టీవీ షోకి రావడం ఇదే ఫస్ట్ టైం.