English | Telugu
ఒక పన్ను మిస్ అయ్యింది..అది సెట్ అయ్యాకే నా చెల్లి పెళ్లి..కామెడీ పోస్ట్ తో రవి కౌంటర్!
Updated : Aug 27, 2022
ప్రియాంక సింగ్ బుల్లి తెర మీద మంచి ఫేమస్ పర్సన్. బిగ్ బాస్ - 5 లో పాల్గొని ఎంతో పాపులారిటీ తెచ్చుకుంది. ఇకపోతే కొద్దిరోజులుగా ప్రియాంకాసింగ్ పెళ్లి చేసుకోబోతున్నట్లుగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టే తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన హల్దీ ఫంక్షన్ ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. ఎల్లో కలర్ లెహంగాలో పెళ్ళికూతురిలా ముస్తాబైన ఫొటోస్ ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది ప్రియాంక.
ఇవన్నీ చూసి ఆమె పెళ్లి చేసుకోబోతుందంటూ గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇంకేముంది అందరూ కంగ్రాట్స్ ప్రియాంక అంటూ విషెస్ పోస్ట్ చేస్తున్నారు. నిజంగానే పెళ్లా లేదంటే ఏదైనా షూటింగ్ కి సంబంధించిన ఫొటోసా అనే ప్రశ్నలు కూడా వచ్చాయి. ఐతే ఇప్పుడు యాంకర్ రవి ఒక ఇంటరెస్టింగ్ పోస్ట్ ఒకదాన్ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పెట్టి అందరిని షాక్ అయ్యేలా చేసాడు " నా చెల్లి పెళ్ళికి ఇంకా చాలా టైం ఉంది..ఎందుకంటే ఈ ఎత్తు పళ్ళల్లోంచి ఒక పన్ను మిస్ అయ్యింది. అది సెట్ చేసాక పెళ్లి చేస్తాం" అంటూ పెట్టిన ఒక కాప్షన్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఇక ఈ ఇన్స్టాగ్రామ్ వీడియోలో ప్రియాంకాసింగ్ ఎత్తుపళ్లతో ఉన్న ఫిల్టర్ వాడి మంచి ఫన్ క్రియేట్ చేసింది. ఇక నెటిజన్స్ ఈ వీడియోకి కామెంట్స్ చేశారు. ప్రియాంకాసింగ్ పెళ్లి అంటూ వస్తున్న వార్తలకు, రూమర్స్ కి భలే చెక్ పెట్టారు అంటూ కామెంట్ చేసారు.