English | Telugu
బిగ్ బాస్ హౌస్‌లోకి అభినయశ్రీ
Updated : Aug 29, 2022
అభినయశ్రీ.. ఈ పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కదూ.. అవును 'ఆర్య' మూవీలో "ఆ అంటే అమలాపురం" అనే సాంగ్ వింటే చాలు అభినయశ్రీ గుర్తొచ్చేస్తుంది. నిన్నటి తరం శృంగార తార అనూరాధ కుమార్తె అయిన ఈమె చాలా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇంకా స్పెషల్ సాంగ్స్ ద్వారా ఈమె సొంత ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు అభినయశ్రీ పేరు ఎందుకు మళ్ళీ చెప్పుకుంటున్నాం అంటే కొంత కాలంగా ఫామ్ లో లేని, అంతా మరిచిపోయిన ఆమె ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. బిగ్ బాస్ సీజన్ 6 కోసం క్వారంటైన్‌లో ఉన్న 20 మంది కంటెస్టెంట్‌లలో అభినయ శ్రీ కూడాఒకరు అని గట్టిగా వినిపిస్తోంది.
ఆర్య, శ్వేత నాగు, అత్తిలి సత్తిబాబు, మైఖేల్ మదన కామరాజు, చందమామ వంటి మూవీస్ లో నటించింది అభినయశ్రీ. ఇక 2014 లో తెలుగులో 'పాండవులు' అనే మూవీలో చివరిసారిగా కనిపించింది. ఈమె తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా యాక్ట్ చేసింది. అభినయశ్రీ తమిళ్ లో జూనియర్ సూపర్ డాన్స్, డాన్స్ జోడి డాన్స్ వంటి షోస్ లోహోస్ట్ గా చేసింది.ఇక ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.