English | Telugu

బాలాదిత్యకు నాగ్ స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌!

బాలాదిత్య చైల్డ్ యాక్టర్ గా సుప‌రిచితుడై, 'చంటిగాడు' మూవీతో హీరోగా అంద‌రికీ న‌చ్చేశాడు. యాక్టర్ గా, యాంకర్ గా, రైటర్ గా, కంపెనీసెక్రటరిగా.. ఒక‌ ఆల్ రౌండర్ బాలాదిత్య. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి 11వ హౌస్‌మేట్ గా ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చిన బాలాదిత్య నాగ్ నటించిన 'హలో బ్రదర్', 'వారసుడు' మూవీస్ లో నటించినట్టు గుర్తు చేశాడు. అలాగే నాగేశ్వరావు గారితో కూడా నటించినట్టు చెప్పాడు.

తన లైఫ్ లో "అన్న" మూవీకి నంది అవార్డు రావడం బెస్ట్ మూమెంట్ అని చెప్పాడు. త‌న‌ పెద్ద కూతురికి 'బంగార్రాజు' మూవీ అంటే ఇష్టం అని, ఒకసారి నాగార్జున‌తో మాట్లాడితేనే కానీ అన్నం తినను అంటూ మారాం చేసిందని చెప్పాడు బాలాదిత్య. ఛార్టర్డ్ అకౌంటెంట్ గా స్టూడెంట్స్ కి లెసన్స్ కూడా చెప్పాడు బాలాదిత్య.

"మల్టీ టాలెంటెడ్ గై హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు జాగ్రత్త" అంటూ మిగతా హౌస్ మేట్స్ ని అలెర్ట్ చేశారు నాగ్. ఇక ఫైనల్ గా బాలాదిత్యకు ఇటీవల పుట్టిన రెండో కూతురి ఫోటో లామినేషన్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు హోస్ట్ నాగ్.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.