English | Telugu
బాలకృష్ణే 'ఆదిత్య 369' సీక్వెల్ చెయ్యాలి!
Updated : Sep 6, 2022
డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారు అంటే ఇప్పటివాళ్లలో ఎక్కువమందికి తెలియకపోవచ్చు కానీ పాత తరం వాళ్లందరికీ సుపరిచితులు. 'ఆలీతో సరదాగా' షోకి వచ్చిన సింగీతం గారు ఎన్నో విషయాలను చెప్పారు. ఆదిత్య 369 మూవీలో ఉన్న టైం మెషిన్ విషయంలో ఆయన నాసా వాళ్ళ నుంచి ప్రశంసలు అందుకున్నారు.
"ఆ మూవీ తీసాక కొంత మంది ఆస్ట్రో ఫీజిసిస్ట్స్ వచ్చి ఇప్పటివరకుటైం మెషిన్ నేపథ్యంలోవచ్చిన సినిమాల్లో ఏది బెస్ట్ అంటూ ఒక మీట్ పెట్టారు.అందులో ఫైనల్ గా'ఆదిత్య 369' మూవీలో ఉన్న టైం మెషిన్ చాలా పర్ఫెక్ట్ అని అప్రిషియేట్ చేశారు" అని సింగీతం చెప్పారు.
సైన్స్ ఫిక్షన్ మూవీస్ అంటే చాలా ఇష్టపడే తను సైన్స్ అండ్ టెక్నాలజీ తెలియకుండానే ఆ మూవీని తీసానన్నారు. ఒక ఆలోచన నుంచి వచ్చిన కథతో ఆ సినిమా తీసి సూపర్ డూపర్ హిట్ కొట్టారు. లైట్ కి, టైంట్రావెల్ కి మధ్య ఉండే పర్ఫెక్ట్ టైంని కరెక్ట్ గా చూపించారని శాస్త్రవేత్తలు ప్రశంసించారని చెప్పారు సింగీతం.
"ఈ మూవీకి సీక్వెల్ 'ఆదిత్య 999' తీయడానికి స్క్రిప్ట్ అంతా సిద్ధంగా ఉంది.ఇంతకుముందే తియ్యాల్సింది కానీ కొన్ని అనివార్య కారణాల వలన కుదరలేదు. బాలకృష్ణ గారే ఈ సెకండ్ పార్ట్ చేయాలి. ఆయనకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఈ మూవీని ప్లాన్ చేస్తాం" అని వెల్లడించారు సింగీతం.