English | Telugu

అష్షును స్వ‌యంవ‌రం పెట్ట‌మంటున్న అభిమాని!

సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న అషు రెడ్డి గురించి స్పెషల్ గాచెప్పక్కర్లేదు. సమంత పోలికలతో ఉండేసరికి మొదట్లో అష్షును అందరూ జూనియర్ సమంత అని పిలిచేవారు. ఈమె చేసిన టిక్ టాక్ వీడియోలుఎంతో పాపుల‌ర్ అయ్యాయి. ఈ ముద్దుగుమ్మకు బుల్లితెరపైన కూడా చాలా అవకాశాలు కూడా వచ్చాయి. బుల్లితెర మీద షోస్ చేస్తూ ప్రేక్షకులను సందడి చేయడమే కాదు,రెండుసార్లు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశాన్ని కూడా అందుకుంది.

ఇప్పుడు అష్షుకి ఒక ఫ్యాన్ నుంచి ఒక కాంప్లిమెంట్ వచ్చింది. ఆ కామెంట్ చదివితే అష్షుకి పెళ్లి వయసు వచ్చేసినట్టే కనిపిస్తోంది. ఆమె ఇన్స్టాగ్రామ్ లో లేటెస్ట్ అప్ డేట్స్ తో పాటు ఫొటోస్ కూడా షేర్ చేస్తూ ఉంటుంది. అలాంటి ఒక ఫోటో చూసిన ఆమె ఫ్యాన్ "స్వయంవరం పెట్టు అష్షు, శివ ధనుస్సు విరిచి పెళ్లిచేసుకుంటా" అంటూ కామెంట్ చేసాడు. అష్షు ఆ కామెంట్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టుకుంది.

అలాగే, "ప్రశ్నలు అడగండి" అనేసరికి.. ఒక ఫ్యాన్, "నీ అందం వెనక సీక్రెట్ ఏమిటి?" అని అడిగాడు. "మంచి మనసు" అనేది అష్షు ఇచ్చిన రిప్లై. "రాహుల్ (సిప్లిగంజ్‌) అన్నతో అస్సలు ఎక్కడ కనిపించ‌ట్లేదు" అని ఇంకొక‌రు అడిగారు. "తిరిగితే తిరిగిందంటున్నారు.. తిరక్కపోతే ఇలా అంటున్నారు" అని ఆన్సర్ ఇచ్చింది అష్షు.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.