English | Telugu
లేడీ గెటప్ లో అదరగొడుతున్న బుల్లెట్ భాస్కర్ తండ్రి!
Updated : Sep 6, 2022
జబర్దస్త్ లో బులెట్ భాస్కర్ కి మంచి క్రేజ్ ఉంది. ఆ షోలోనే కాదు ఐతే శ్రీదేవి డ్రామా కంపెనీలో, ఎక్స్ట్రా జబర్దస్త్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. బుల్లి తెర మీద చూస్తే గనక చాలా ఫామిలీలు మొత్తం ఇక్కడే కనిపిస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు భాస్కర్ ఒకసారి ఫామిలీ స్కిట్ లో భాగంగా తన తండ్రిని స్టేజి మీదకు తీసుకురావడం ఆయన కూడా కామెడీ బాగా పండించేసరికి అలా జబర్దస్త్ లో కంటిన్యూ ఐపోతున్నాడు.
శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా స్కిట్స్ వేస్తున్నాడు. ఇక ఇప్పుడు అందరిలాగే లేడీ గెటప్ వేసేశాడు. ఈ మధ్య ఈ కామెడీ షోస్ లో లేడీ గెటప్స్ బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక భాస్కర్ వాళ్ళ నాన్న వేసిన లేడీ గెటప్ నిజంగా ఎక్స్ట్రా జబర్దస్త్ షోకి హైలైట్ అని చెప్పొచ్చు. ఇక ఈయన గారి గెటప్ మీద రష్మీ కూడా కౌంటర్లు వేసేసింది. అప్పారావు గారు మీరు కూడా లేడీ గెటప్ తో బోణి చేశారన్నమాట అంది.
ఇంతలో "భాస్కర్ స్టేజి మీదకు వచ్చి అమ్మకు నీ మొహం ఎలా చూపిస్తావ్ నాన్న అనేసరికి ఇలాగే చూపిస్తాను" అన్నాడు. ఆ మాటకు మైక్ కింద పెట్టేసి అలా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు భాస్కర్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో ఫుల్ సందడి చేస్తోంది.