English | Telugu
ఒకవైపు 'సై' సినిమా ఆఫరు.. ఇంకో వైపు అమ్మ పోయిన కబురు!
Updated : Sep 5, 2022
బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రతీ ఒక్క కంటెస్టెంట్ వెనక ఎన్నో కన్నీటి కథలు ఉన్నాయి. షానీ కథ కూడా అలాంటిదే. "నాపేరు షానీ.. నాది వండర్ ఫుల్ కహానీ" అంటూ 14 వ కంటెస్టెంట్ గా ఎంటరయ్యాడు షానీ. ‘ఎస్ఎస్ రాజమౌళి నుంచి ఆఫర్ వచ్చిన రోజే.. తల్లిని కోల్పోయాను’ అని అతను చెప్పిన మాటలు కన్నీళ్లు తెప్పించాయి.
తన అసలు పేరు సాల్మన్ అని చెప్పాడు. జడ్చర్లకు చెందిన ఈయన ప్రొఫెషనల్ ఖోఖో ప్లేయర్. నేషనల్ లెవల్ అథ్లెటిక్స్ లో షానీ గోల్డ్ మెడలిస్ట్ కూడా. 2003లో తన కేరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఆరోగ్యం బాగాలేకప్రొఫెషన్ కు బైబై చెప్పాల్సి వచ్చిందన్నారు. అదే టైములో రాజమౌళి ‘సై’ సినిమాలో స్పోర్ట్స్ మెన్ గా ఆఫర్ వచ్చింది. కానీ అదే టైంకి అమ్మ చనిపోయిన వార్త కూడా తెలిసింది. ఒకటి ఆనందం తెచ్చిపెడితే, ఇంకోటి బాధను పంచింది అంటూఎమోషనల్ అయ్యాడు.
తనకు ఎంతో ఇష్టమైనఫెవరేట్ షో ‘బిగ్ బాస్’ హౌస్ లోకి వెళ్లడం చాలా హ్యాపీగా ఉందన్నారు. షానీ పేరు వెనక కథేమిటి అని అడిగేసరికి, తనకు ఐదుగురు గర్ల్ ఫ్రెండ్స్ వున్నారని వాళ్ళ పేర్లలోని మొదటి అక్షరాలను కలిపి పెట్టుకున్నట్లు చెప్పాడు. అదే పేరును ‘సై’ మూవీలో కూడా పెట్టారని చెప్పారు.