English | Telugu
ఇంతకు రష్మీ వయసెంత?
Updated : Sep 6, 2022
రష్మీ జబర్దస్త్ లో క్రేజీ యాంకర్. చాలా మంది కమెడియన్స్ రష్మీ మీద జోకులు పేలుస్తూ ఉంటారు. రష్మీ కూడా ఓ వైపు వాటిని ఎంజాయ్ చేస్తూనే, మరోవైపు వాటిని తిప్పి కొడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంద్రజ కూడా రష్మీ మీద సెటైర్లు వేసింది. లేటెస్ట్ ఎపిసోడ్ ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో సోషల్ మీడియాలో రిలీజ్ అయింది. ఇందులో ప్రేమపక్షులు జోర్దార్ సుజాత, రాకింగ్ రాకేష్ కలిసి ఒక స్కిట్ ప్లే చేశారు.
ఈ స్కిట్ లో ఒక లేడీ కమెడియన్ జోర్దార్ సుజాతకు తల్లిగా యాక్ట్ చేసింది. ఆమెని చూసి రష్మీ.. "వీళ్ళు మీ కూతుళ్లా" అని అడిగింది. "అవును" అని చెప్పిందామె. "అరె.. మీ కూతుళ్ళ కంటే మీరే యంగ్ గా ఉన్నారే" అని రష్మీ అనేసరికి, ఇంద్రజ ఎంట్రీ ఇచ్చి "ఏ వయసు వారికి ఆ వయసు వారు అందంగా కనిపిస్తారు" అని సెటైర్ వేసింది. ఇంద్రజ వేసిన సెటైర్ తో రష్మీ ముఖం మాడిపోయింది.
తర్వాత బుల్లెట్ భాస్కర్, వర్ష, ఇమ్మాన్యుయేల్ కలిసి చేసిన స్కిట్ చాలా బాగుంది. ఈ స్కిట్ లో బుల్లెట్ భాస్కర్, వర్ష ఓ సినిమా ఈవెంట్ కి వచ్చిన హీరో హీరోయిన్స్ లా కనిపించారు. ఇమ్ము ఆ ఈవెంట్ కి వచ్చిన ఆడియెన్సులా సందడి చేసాడు. బులెట్ భాస్కర్ మాట్లాడుతూ "మన సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో హౌస్ ఫుల్ అవుతుందా లేదా" అని అడిగాడు. "అవుతుంది".. అంటూ అరిచాడు ఇమ్ము. "ఎందుకంటే మ్యాట్నీ కల్లా నీ సినిమా దొబ్బిద్ది" అని ఇమ్మానుయేల్ పంచ్ వేసేసరికి ఇంద్రజ పడీ పడీ నవ్వింది.