English | Telugu

ఇనయ రెహమాన్ సుల్తానా.. D/O ముజిబుర్ రెహమాన్!

బిగ్ బాస్ మొదటి రోజు పక్కా లోకల్ పాటతో మొదలైంది. తరువాత గలాట గీతుకి, ఇనయ సుల్తానాకి మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. బిగ్ బాస్ టాస్క్ లో భాగంగా క్లాస్, ట్రాష్, మాస్ అని మూడు భాగాలుగా చేసి, అందులో ఎవరు ఉండాలో గ్రూప్ సభ్యులనే ఎన్నుకోమన్నాడు. తర్వాత ఒక్కొక్కరుగా వచ్చి తమ అభిప్రాయాలు చెప్పుకొచ్చారు. చివరికి ఇనయ సుల్తానా, గలాటా గీతు, రేవంత్ ట్రాష్ గ్రూపుగా ఎన్నిక‌య్యారు. మిగిలిన వాళ్ళలో క్లాస్, మాస్ గా విభజించారు.

"సభ్యులలో ఎవరైనా వచ్చి మీ గురించి మీరు చెప్పుకోండి" అని బిగ్ బాస్ ఆదేశించాడు. మొదటగాఇనయ సుల్తానా మాట్లాడింది. "మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. మమల్ని చాలా కష్టపడి పెంచాడు. ఇండస్ట్రీకి వెళ్లి, మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసాడు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. మా అమ్మకి నేను హైదరాబాద్ కి రావడం నచ్చలేదు. ఐనా వచ్చేసా. నేను వచ్చే రెండు రోజుల ముందు మా నాన్న చనిపోయాడు." అని ఆమె చెప్ప‌గానే.. సభ్యులు అందరూ ఉద్వేగానికి లోనయ్యారు. "మా నాన్న పేరు ముజిబుర్రెహమాన్. అందుకే నా పేరులో కలుపుకొని చెబుతాంటా ఇనయ ముజిబుర్ సుల్తానా అని." అన‌గానే కంటెస్టెంట్స్ వచ్చి హత్తుకొని ఓదార్చారు.

తర్వాత రేవంత్ తన గురించి మాట్లాడాడు. తను చాలా కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కి పైకి వచ్చానని చెప్పుకున్నాడు. తర్వాత గలాటా గీతు చెప్పింది. తనను చిన్నప్పటి నుండి ఎవరూ పట్టించుకోలేదని, ఎవరూ సపోర్ట్ చేయలేదని, తనని గుర్తించిన వాళ్ళు తన ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ అని ఆ తర్వాత బిగ్ బాస్ తన ట్యాలెంట్ గుర్తించారని చెప్పింది.

ఆ తర్వాత బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లు చేసారు. అలా మొదటి రోజు కొన్ని నిట్టూర్పులతో, కొన్ని సంతోష‌క‌ర క్ష‌ణాల‌తో గడిచింది.