English | Telugu
పెళ్ళిపీటల మీద కూర్చుంది కావ్య అని కనిపెట్టిన కృష్ణమూర్తి!
Updated : Mar 4, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-34 లో.. స్వప్న పెళ్ళి టైంకి జంప్ అవుతుంది. రుద్రాణి ఒక ప్లాన్ వేసి పెళ్ళికూతురుగా కావ్యని పెళ్లి పీటల మీద కూర్చోపెట్టడానికి కనకంతో మాట్లాడుతుంది. దాంతో కనకం కావ్యని ఒప్పిస్తుంది. దుగ్గిరాల ఫ్యామిలీ ఇంకా పెళ్ళి కూతురు రావట్లేదని ఎదురుచూస్తారు. ఏం జరుగుతుందో చూద్దామని వాళ్ళంతా వెళ్లిపోతుండగా.. కావ్యకి ముసుగువేసి కనకం తీసుకొస్తుంది. అప్పుడు రాజ్ కూల్ అయి పెళ్లి పీటలపై కూర్చుంటాడు. ఇక రాజ్ పిన్ని ముసుగుతో వచ్చిన కావ్యని చూసి.. "ఏంటి ఈ ముసుగు" అని అడుగుతుంది. ఇది మా ఇంటి ఆచారమని కనకం చెప్తుంది.
పెళ్ళితంతు మొదలవుతుంది. ఆ తర్వాత కాళ్ళు కడిగే టైంకి అక్కడ కూర్చున్నది స్వప్న కాదు కావ్య అని కృష్ణమూర్తి తెలుసుకుంటాడు. ఇక పక్కనే ఉన్న కనకం.. "ఏం మాట్లాడొద్దు" అని కృష్ణమూర్తిని సైలెంట్ గా ఉండమని చెప్పి కవర్ చేస్తుంది. మరోవైపు రాహుల్, స్వప్న ఇద్దరు కలిసి కార్ లో వెళ్తూ ఒకరి గురించి ఒకరు మనసులో అనుకుంటారు. స్వప్న కోటీశ్వరుల కుమార్తె.. తన ఆస్తి మొత్తం నాకే అని అనుకుంటాడు రాహుల్. అలాగే స్వప్న కూడా అనుకుంటుంది. దగ్గరలో వచ్చే గుడి దగ్గర స్వప్న కార్ ఆపమని.. గుడిలో పెళ్లి చేసుకుందామని అంటుంది. మరోవైపు కనకం చేసిన పనికి కృష్ణమూర్తి మండిపడుతాడు. ఇప్పటికే నీ గొంతెమ్మ కోరికలు తీర్చడానికి కావ్య కష్టపడుతుంది. ఇప్పుడు దానికి ఆ రాజ్ అంటే పడదు.. అప్పు, స్వప్నని తీసుకురాకుంటే కావ్య పరిస్థితి ఏంటి? నేను వెళ్ళి అందరికి నిజం చెప్తానని కృష్ణమూర్తి వెళ్తుంటాడు.. "మీరు నిజం చెప్తే నేను ఉరేసుకొని చనిపోతా" అని బెదిరిస్తుంది. దాంతో కృష్ణమూర్తి సైలెంట్ గా ఉండిపోతాడు. మరోవైపు రాహుల్ చెప్పే మాయ మాటలు నమ్ముతూ ఇంకా మోసపోతూనే ఉంటుంది స్వప్న. పెళ్లి గుడిలో కాకుండా నేను హై లెవెల్ లో చేసుకోవాలనుకుంటున్నా అని రాహుల్ అనడంతో స్వప్న ఎంతో సంతోషంగా ఓకే అంటుంది.
ఆ తర్వాత రాజ్, కావ్య ఇద్దరు ఒకరి తలమీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు. ఇక పెళ్ళి టైంకి అప్పు, స్వప్నని తీసుకొస్తుందా? లేక రాజ్, కావ్యనే పెళ్లి చేసుకుంటాడా? తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.