ఈ షోకి కూడా ఆ జడ్జిస్సేనా...బోరింగ్...
నిన్న గాక మొన్న బీబీ జోడి ఇలా పూర్తి చేసుకుందో లేదో "నీతోనే డాన్స్" అనే మరో డాన్స్ షో స్టార్ట్ కావడానికి సిద్ధమైపోయింది. బీబీ జోడిలో అందరూ బీబీ హౌస్ లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చారు. కానీ ఈ "నీతోనే డాన్స్" షోకి మాత్రం సీరియల్ యాక్టర్స్ ని, జబర్దస్త్ కమెడియన్స్ ని తీసుకొచ్చారు. ఇక బీబీ జోడి జడ్జెస్ టీం మాత్రం నిను వీడని నీడను నేనే అన్నట్టుగా ఈ షోకి కూడా కలిసికట్టుగా వచ్చేసారు.. వాళ్ళే అలనాటి అందాల సీనియర్ నటి రాధ, రాను రాను అంటూ తెలుగు ఆడియన్స్ గుండెల్లో ఉండిపోయిన సదా అలాగే తరుణ్ మాస్టర్. ఇక హోస్ట్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..ఆదివారం రాత్రి 9 గంటలకు గ్రాండ్ గా లాంఛ్ కాబోతోంది ఈ షో.