Read more!

English | Telugu

కొత్త జర్నీ స్టార్ట్ చేసిన కెవ్వు కార్తిక్

జబర్దస్త్‌ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కెవ్వు కార్తీక్ ఒక ఇంటివాడు అయ్యాడు. హైదరాబాద్ లో ఆయన పెళ్లి ఘనంగా జరిగింది. రీసెంట్ గా కెవ్వు కార్తీక్ తనకు కాబోయే అమ్మాయి ఫోటో కనబడకుండా  తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. "నా జీవితంలోకి ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నా...నువ్వొస్తే నా లైఫ్ చాలా అందంగా ఉంటుంది..నా జీవితంలోకి అడుగు పెడుతున్న నీకు కృతజ్ఞతలు...".  అంటూ ఒక ఎమోషనల్ నోట్స్ కూడా రాసుకున్నాడు. "పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారు అని విన్నాను కానీ దాని అర్ధం ఇప్పుడు నాకు తెలిసింది.

నా జీవితంలోకి వచ్చిన అందమైన సిరి స్వగతం" అని కూడా పోస్ట్ చేసుకున్నాడు. అలాంటి కార్తిక్ ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నాడు. ఈ పెళ్ళికి బుల్లితెర నుంచి చాలామంది హాజరయ్యి వాళ్లకు విషెస్ చెప్పారు. యాట నవీన, శ్రీవాణి వాళ్ళ పెళ్ళికి వెళ్లారు.."వచ్చే ఏడాదికి నలుగురు పిల్లల్ని కనాలి" అంటూ నవీన సరదాగా ఫన్ చేసింది. వైవాహిక జీవితంలోకి అడుగెట్టిన మా కెవ్వు కార్తిక్ , శ్రీలేఖకు  వివాహ మహోత్సవ శుభాకాంక్షలు ..మీరు జీవితాంతం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆశిస్తూ అంటూ గెటప్ శీను అండ్ ఫామిలీ విష్ చేశారు. ఇక ఈ పెళ్ళికి వెళ్లిన సీరియల్ యాక్టర్స్,  సోషల్ మీడియా ద్వారా కెవ్వు కార్తీక్ పెళ్లి ఫొటోలను షేర్ చేసుకుంటున్నారు. జబర్దస్త్  షో ద్వారా పాపులరైన కమెడియన్, రైటర్ కెవ్వు కార్తీక్ పెళ్ళికి కమెడియన్లు హాజరయ్యారు. విష్ యు హ్యాపీ మారీడ్ లైఫ్ అంటూ నెటిజన్స్ విష్ చేస్తున్నారు.