English | Telugu

ఎదవా.. నిజమైన బ్లూ టిక్ వచ్చిన హ్యాపీనెస్ కూడా లేదు కదరా!

ఇన్స్టాగ్రామ్ బ్లూ టిక్ కోసం చాలామంది పడిగాపులు పడుతున్నారు. సెలబ్రిటీస్ అంతా కూడా ఆ బ్లూ టిక్ కోసం కలలు కంటూ చాల హార్డ్ వర్క్ చేస్తున్నామని చెప్తూ డాన్స్ లు, ఫోటో షూట్ లు, ఆస్క్ మీ క్వశ్చన్స్, లైవ్ వీడియోస్ పేరుతో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజీల్లో పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకోవడంలో తలమునకలవుతూ ఉండగా మరో వైపు ఇన్ స్టాగ్రామ్ లో 699 కడితే చాలు బ్లూ టిక్ ఆప్షన్ ఇచ్చేస్తుండడంతో సెలబ్రిటీస్ కి ఒళ్ళు మండిపోతోంది. తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. ఇప్పటికే అఖిల్ సార్థక్ ఈ విషయం మీద ఫుల్ గరం ఐపోయాడు. ఇన్స్టాగ్రామ్ ని తిడుతూ ఒక వీడియో పోస్ట్ చేసాడు.

ఆ టాటూతో హరితేజ కనెక్ట్ అయ్యిందంట!

హరితేజ.. అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై తనదైన ముద్రని వేసుకున్న నటి, యాంకర్. హరితేజ యాంకర్ గా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుని ఇప్పుడు మంచి ఆఫర్స్ తో బిజీగా ఉంటుంది. అయితే  హరితేజ తన గత ఏడాది ఆడపిల్లకి జన్మనిచ్చిన విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం హరితేజ తన కూతురు భూమితల్లిని చూసుకుంటూ సమయం గడుపుతుంది. తనకి సంబంధించిన విషయాలన్నింటిని హరితేజ ఎప్పటికప్పుడు తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేస్తుంది. అలాగే హరితేజ ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కువ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా తను పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారిన విషయం అందరికీ తెలిసిందే.

ఏంజెల్ ప్రియ, ఛార్మింగ్ త్రిష.. ఇన్ స్టాగ్రామ్ ని తిడుతున్న అఖిల్ !

అఖిల్ సార్థక్.. బిగ్ బాస్ ముందు వరకు ఎవరికి తెలియదనే చెప్పాలి. బిగ్ బాస్ సీజన్-4 తో ఎంతో పాపులారిటి సొంతం చేసుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్న రోజులు మోనాల్ గజ్జర్ తో నడిపిన లవ్ ట్రాక్ మామూలుగా లేదనే చెప్పాలి. బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు తనకి నచ్చినట్టుగా ఉండేవాడు అఖిల్. అతని బిహేవియర్ చాలా మందికి నచ్చేది కాదు. అంతేకాకుండా హౌస్ లో మోనాల్ గజ్జర్ గురించి అఖిల్, అభిజిత్ ల పంచాయతీ వీధుల్లో కుళాయిల దగ్గర ఉండే కొట్లాటలాగా ఉండేది. అఖిల్ బిగ్ బాస్-4 రన్నర్ గా నిలిచిన విషయం అందరికి తెలిసిందే. అంతేకాకుండా బిగ్ బాస్ ఓటీటీలో కూడా మరోసారి ఎంట్రీ ఇచ్చి.. అందులో కూడా రన్నరప్ గానే నిలిచాడు.

కన్నకొడుకు ఆచూకీ కోసం ఏడ్చేసిన మహేంద్ర!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -791 లో.. వసుధార గురించి మహేంద్ర కాలేజీలో అడుగుతాడు. అలా వసుధార గురించి అడగడం చుసిన రిషి.. నేను ఇక్కడ ఉన్నట్లు డాడ్ కి వసుధార చెప్పిందేమో అందుకే డాడ్ వచ్చాడని అనుకుని వసుధార దగ్గరికి వెళ్తాడు రిషి. "నేను ఇక్కడ ఉన్నట్లు డాడ్ కి నువ్వే చెప్పావా" అని వసుధారని అడుగుతాడు రిషి. లేదు నేను ఎందుకు చెప్తానని వసుధార అంటుంది. నువ్వు చెప్పకుండానే  డాడ్ ఇక్కడికి వచ్చారా అని రిషి అంటాడు. అన్ని అబద్ధాలు, మోసాలు.. ఇప్పటికే నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది. ఇప్పుడు డాడ్ కి నేను ఇక్కడ ఉన్నట్లు చెప్పకు అని వసుధారకి చెప్పి పక్కన వెళ్ళి నిల్చుంటాడు రిషి.

కొడైకెనాల్ టూర్ లో బ్రహ్మముడి సీరియల్ కావ్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ ఇప్పుడు అత్యధిక టీఆర్పీ తో నెంబర్ స్థానంలో కొనసాగుతుంది. ఈ సీరియల్ లోని కనకం-కృష్ణమూర్తిల కుటుంబం ఒక మధ్యతరగతి కుంటుంబం. ఇందులో స్వప్న, కనకం ఆశలు గాల్లో ఉండగా.. కావ్య, కృష్ణమూర్తి ల ఆలోచనలు బాగుండాలి.. నిజాయితీగా ఉండాలి.. ఎవరిని నొప్పించకూడదనే విధంగా ఉంటాయి. అయితే ఈ ఫ్యామిలోని కావ్య, అప్పు, స్వప్న అందరికీ సుపరిచితమే..  కావ్య అలియాస్ దీపిక రంగరాజు ఇప్పుడు ప్రతీ కుటుంబంలో ఒక అమ్మాయిలా  మారిపోయింది. ప్రతిరోజూ దీపిక రంగరాజు తన ఇన్ స్టాగ్రామ్ లో  'బ్రహ్మముడి' సీరియల్ కి సంబంధించిన వివరాలను షేర్ చేస్తుంటుంది. 

మా కుటుంబంలోకి రాకింగ్ రాకేష్

జబర్దస్త్ రాకింగ్ రాకేష్ తనకు సంబంధించిన ఒక గుడ్ న్యూస్ ని తన ఫాన్స్ తో షేర్ చేసుకున్నాడు. రాకేష్ ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. జబర్దస్త్‌ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్స్ లో రాకేష్ కూడా ఒకరు. నార్మల్ గా కామెడీ చేసే స్టేజి నుంచి ఎదుగుతూ వచ్చి ఇప్పుడు టీం లీడర్ అయ్యాడు. తన కామెడీ పంచులు, డైలాగులతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు. రీసెంట్ గా జోర్దార్ సుజాతను పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కలిసాక రాకేష్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. జబర్దస్త్‌ స్టేజి మీద  ఈ జోడీకి ఎంతో క్రేజ్‌ ఉంది.